Usha Parinayam: దుబాయ్‌లో అయింది.. ఇప్పుడు కాశ్మీర్‌లో..

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:03 PM

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌భాస్క‌ర్. చాలా గ్యాప్ తర్వాత మ‌ళ్లీ ఆయన ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. ‘ఉషా ప‌రిణ‌యం’ అనే బ్యూటీఫుల్ టైటిల్‌తో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట‌ను హీరో, హీరోయిన్‌పై దుబాయ్‌లో చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం చిత్రయూనిట్ కాశ్మీర్‌కు ప‌య‌న‌మైంది.

Usha Parinayam: దుబాయ్‌లో అయింది.. ఇప్పుడు కాశ్మీర్‌లో..
Usha Parinayam Movie Still

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌భాస్క‌ర్. చాలా గ్యాప్ తర్వాత మ‌ళ్లీ ఆయన ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టారు. ‘నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి’ వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో.. ప్రస్తుతం ‘ఉషా ప‌రిణ‌యం’ (Usha Parinayam) అనే బ్యూటీఫుల్ టైటిల్‌తో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘ల‌వ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనేది ఉప‌శీర్షిక‌. విజ‌య్‌భాస్క‌ర్ క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై కె. విజ‌య్‌భాస్క‌ర్ (K Vijaya Bhaskar) స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ (Sree Kamal) హీరోగా న‌టిస్తుండ‌గా, తాన్వీ ఆకాంక్ష (Tanvi Akaanksha) అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుంది. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాట‌ను హీరో, హీరోయిన్‌పై దుబాయ్‌లో చిత్రీక‌రించారు. ప్ర‌స్తుతం రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ కోసం చిత్రయూనిట్ కాశ్మీర్‌కు ప‌య‌న‌మైంది. (Usha Parinayam Shooting Update)


Usha.jpg

ఈ సంద‌ర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియ‌జేస్తూ.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన చిత్రీక‌ర‌ణ‌తో టాకీపార్ట్ పూర్త‌యింది. ఇటీవ‌ల దుబాయ్‌లో ఓ పాట‌ను చిత్రీక‌రించాం. ప్ర‌స్తుతం రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ నిమిత్తం కాశ్మీర్ వెళుతున్నాం. యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల వారిని అల‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్‌తో చాలా హ్యాపీగా ఉన్నామని అన్నారు. సూర్య‌, ర‌వి, శివ‌తేజ‌, అలీ, వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి వంటి వారు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లలో నటిస్తోన్న ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువ‌న్‌ సంగీతం అందిస్తున్నారు. (#UshaParinayam)


ఇవి కూడా చదవండి:

====================

*Gaami Movie Review: విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా ఎలా ఉందంటే...

****************************

*Gaami: ‘గామి’ ట్విట్టర్ టాక్.. విశ్వక్ సేన్‌కి హిట్ పడినట్టేనా?

*************************

*Allu Arjun and Sneha Reddy: 13వ పెళ్లి రోజు.. ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

****************************

Updated Date - Mar 08 , 2024 | 01:03 PM