K Vijaya Bhaskar: విజయ్‌భాస్కర్‌.. ఉషా పరిణయం

ABN , Publish Date - Feb 14 , 2024 | 01:42 PM

టాలీవుడ్‌ దర్శకుల్లో తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న దర్శకుల్లో కె. విజయ్‌ భాస్కర్‌ ఒకరు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తెరకెక్కించిన ఆయన సరికొత్త ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి శ్రీకారం చుట్టారు.

K Vijaya Bhaskar: విజయ్‌భాస్కర్‌.. ఉషా పరిణయం

టాలీవుడ్‌ దర్శకుల్లో తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకున్న దర్శకుల్లో కె. విజయ్‌ భాస్కర్‌ (K vijay Bhaskar) ఒకరు. నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రాలను తెరకెక్కించిన ఆయన సరికొత్త ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రానికి శ్రీకారం చుట్టారు. విజయ్‌ భాస్కర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం  'ఉషా పరిణయం’. లవ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనేది ఉపశీర్షిక. క్రాఫ్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్‌ భాస్కర్‌ తనయుడు  శ్రీకమల్‌ హీరోగా నటిస్తుండగా, తాన్వీ ఆకాంక్ష హీరోయిన్‌గా పరిచయం కాబోతుంది. వాలంటైన్స్‌ డే సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు జరిగిన చిత్రీకరణతో టాకీ పార్ట్‌ పూర్తయిందని, త్వరలోనే పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్తున్నామని చిత్ర యూనిట్‌  తెలిపింది.


శ్రీకమల్‌, తాన్వి ఆకాంక్ష, సూర్య, రవి, శివతేజ, అలీ, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, ఆమని, సుధ, ఆనంద్‌ చక్రపాణి, రజిత ఇతర ప్రఽధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్‌.ఆర్‌ ధ్రువన సంగీతం అందిస్తుండగా,  సతీష్‌ ముత్యాల ఛాయగ్రాహకుడిగా పని చేస్తున్నారు. 

Updated Date - Feb 14 , 2024 | 01:42 PM