Baak: ‘బాక్’ సెన్సార్ పూర్తి.. విడుదలకు రెడీ

ABN , Publish Date - Apr 27 , 2024 | 06:15 PM

సుందర్ సి, తమన్నా భాటియా, రాశి ఖన్నా, అవ్నీ సినిమాక్స్, ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP క్రేజీ థ్రిల్లర్ ‘బాక్’ సెన్సార్ పూర్తి చేసుకని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యూబైఏ సర్టిఫికేట్ జారీ చేశారు. మే3న ఈ చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.

Baak: ‘బాక్’ సెన్సార్ పూర్తి.. విడుదలకు రెడీ
Baak Movie Still

అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ సిరీస్ ‘అరణ్మనై’ (Aranmanai) నుంచి నాల్గవ చిత్రం అరణ్మనై 4 (Aranmanai) తెలుగులో ‘బాక్’ (Baak) పేరుతో రాబోతోంది. సుందర్ సి (Sundar C) దర్శకత్వంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో తమన్నా భాటియా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashi Khanna) హీరోయిన్లు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ యూబైఏ సర్టిఫికేట్‌ను ఈ చిత్రానికి జారీ ఇచ్చింది. దీంతో మే 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. (Baak Censor Completed)

Baak.jpg

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘పంచుకో’ పాట మంచి రెస్పాన్స్‌తో చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తమన్నా, రాశీ ఖన్నా.. తమ అందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడం కాయం అనేలా ఇప్పటికే ఈ పాటతో క్లారిటీ వచ్చేసింది. అవ్నీ సినిమాక్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. (Baak Censor Details)


Raashi-Khanna.jpg

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP (Asian Suresh Entertainment LLP) తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ చిత్రానికి కృష్ణమూర్తి డీవోపీగా పని చేస్తుండగా, ఎడిటింగ్‌ను ఫెన్నీ ఆలివర్‌ పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్. ఇంతకు ముందు సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్రాంచైజ్ సినిమాలకు మాదిరిగానే.. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 06:15 PM