Tamannaah: ‘ఓదెల 2’ లో..

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:21 PM

2022లో ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఇప్పుడు టీమ్ ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓదెల2’ టైటిల్‌తో వస్తోంది. ఇది కథ, స్పాన్, కాస్టింగ్, ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాల పరంగా మ్యాసివ్‌గా ఉండబోతోందని మేకర్స్ తెలిపారు. శుక్రవారం కాశీలో ఈ సినిమాను ప్రారంభించారు.

Tamannaah: ‘ఓదెల 2’ లో..
Odela 2 Movie Opening

2022లో ఓటీటీలో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సంపత్ నంది కథ అందించగా, అశోక్ తేజ దర్శకత్వం వహించారు. ఇప్పుడు టీమ్ ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓదెల2’ టైటిల్‌తో వస్తోంది. ఇది కథ, స్పాన్, కాస్టింగ్, ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాల పరంగా మ్యాసివ్‌గా ఉండబోతోందని మేకర్స్ తెలిపారు. యూనివర్సల్ అప్పీల్ వున్న ‘ఓదెల 2’లో స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. తమన్నా ఇటీవల OTTలో వరుస హిట్స్‌తో దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యారు. ఈ చిత్రాన్ని పలు భాషల్లో థియేటర్స్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంపత్ నంది క్రియేటర్‌గా వున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ (Ashok Teja) దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ (Sampath Nandi Teamworks) బ్యానర్‌లపై డి మధు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం శుక్రవారం కాశీలో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ కూడా మేకర్స్ ప్రారంభించారు. (Odela 2 Movie Launched)


sampath-Nandi.jpg

‘ఓదెల రైల్వే స్టేషన్’‌కు సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ ‘ఓదెల 2’.. మరింత రూటెడ్‌గా థ్రిల్లింగ్‌గా వుండబోతోంది. సీక్వెల్ గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలు చాలా అద్భుతంగా వుండబోతున్నాయి. టైటిల్ పోస్టర్ చాలా క్రియేటివ్‌గా ఉంది. ఇది మల్లన్న స్వామిగా పూజింపబడే శివుని త్రిశూలాన్ని చూపిస్తుంది. నెంబర్ 2 త్రిశూలం విభూతి, ఒక బిందీ శివలింగాన్ని చూడగలిగే విధంగా రూపొందించారు. ఇది ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. హెబ్బా పటేల్ (Hebah Patel), వశిష్ట ఎన్ సింహా (Vasishta N Simha) ముఖ్య తారాగణం. VFX సినిమాలో టాప్ క్లాస్‌గా ఉండబోతుతున్నాయని, ‘ఓదెల 2’లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారని మేకర్స్ తెలిపారు.

Tam.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Prashanth: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు

****************************

*SV18: గీతా ఆర్ట్స్‌లో సినిమా.. శ్రీ విష్ణు రియాక్షన్ చూశారా..

***********************************

*Mega Brother: ఆ వ్యాఖ్యలపై సారీ చెప్పిన మెగా బ్రదర్..

*************************

Updated Date - Mar 01 , 2024 | 05:21 PM