TamannahMarriage: విజయ్ వర్మతో ఫిక్స్ అంటున్నారు

ABN , First Publish Date - 2023-04-25T13:37:51+05:30 IST

ప్రముఖ నటి తమన్నా భాటియా మరో సరి వార్తల్లో వుంది. ఇంకో సారి తన ప్రియుడు విజయ్ వర్మతో కారులో డిన్నర్ కి వెళుతూ ఫోటోలు తీస్తున్న వాళ్ళకి చేతులు ఊపుతూ మరీ వెళ్ళింది. పెళ్లి వరకు వెళుతుందా లేదా ఇంతవరకేనా...

TamannahMarriage: విజయ్ వర్మతో ఫిక్స్ అంటున్నారు
Tamannah Bhatia

తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇటు దక్షిణాదిలోనూ, అటు బాలీవుడ్ లోనూ బాగా పాపులర్ అయిన నటి. ఆమధ్య ఆమెకి, విజయ్ వర్మకి (Vijay Varma) మధ్య ఎదో ఉందని వార్తలు, వీడియోలు అన్నీ వైరల్ అయ్యాయి కదా. అలాగే ముద్దుపెట్టుకుని ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి. దాని మీద ఆ ఇద్దరూ ఏమీ అధికారికంగా ప్రకటించలేదు కూడా. విజయ్ వర్మ, ఆమెతో పాటు ఒక వెబ్ సిరీస్ లో కలిపి నటించాడు. అక్కడ నుండి వీళ్ళ ప్రేమ మొదలయిందండి ఒక టాక్ నడుస్తోంది. #TamannahBhatia

అయితే ఆమె ఈ ప్రేమ గురించి బహిరంగంగా బయటకి చెప్పటం లేదు కానీ, బహిరంగంగా విజయ్ వర్మతో మాత్రం తిరుగుతూ అందరికీ కనువిందు చేస్తోంది. #TamannahVijayVarma అలాగే నిన్న రాత్రి కూడా విజయ్ వర్మతో #VijayVarma కారులో వెళుతూ, ఫోటోలు తీసుకున్న వాళ్ళకి చేతులు కూడా ఊపి మారీ వెళ్ళింది.

tamannahvijayvarma.jpg

ఇద్దరూ డిన్నర్ డేట్ కి వెళ్లారు అని మొత్తం సాంఘీక మాధ్యమాల్లో అంతా కోడై కూస్తోంది. ఇది ముంబై లో జరిగింది. ఇప్పుడు తమన్నా ఎక్కువగా ముంబై లో ఉంటోంది కదా, తెలుగులో కానీ, తమిళం లో కానీ షూటింగ్ ఉంటే వస్తోంది, మళ్ళీ ముంబై వెళ్ళిపోతోంది. ఇంతకు ముందు ఎక్కువ హైదరాబాద్ లో ఉండేది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ కారుని స్వయంగా విజయ్ వర్మ నడుపుకుంటూ వెళ్ళటం.

ఈ ఇద్దరూ బయటకి చెప్పకపోయినా, వీళ్లిద్దరి బంధం మాత్రం చాలా బలంగా ఉందని ఒక టాక్ నడుస్తోంది. ఈ బంధం పెళ్లివరకు కూడా వెళ్లొచ్చు అని కూడా అంటున్నారు. తమన్నా తెలుగు లో చిరంజీవి (MegaStar Chiranjeevi) పక్కన 'భోళాశంకర్' (Bholaa Shankar) సినిమాలో నటిస్తోంది. దీనికి మెహెర్ రమేష్ (Meher Ramesh) దర్శకుడు కాగా, కీర్తి సురేష్ (Keerthy Suresh) ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది.

Updated Date - 2023-04-25T13:41:10+05:30 IST