Baak: 'బాక్' చిత్రం నుంచి.. మాయ, టైగర్‌ ఫస్ట్ లుక్స్ విడుదల

ABN , Publish Date - Apr 11 , 2024 | 08:16 PM

ద‌శాబ్దం క్రితం మొద‌లై అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సినిమా సిరీస్ 'అరణ్మనై' దాని నాల్గవ వెర్షన్ మరింత బిగ్గర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Baak: 'బాక్' చిత్రం నుంచి.. మాయ, టైగర్‌ ఫస్ట్ లుక్స్ విడుదల
baak

ద‌శాబ్దం క్రితం మొద‌లై అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సినిమా సిరీస్ 'అరణ్మనై' దాని నాల్గవ వెర్షన్ (Aranmanai 4) మరింత బిగ్గర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుందర్ సి (Sundar) దర్శకత్వం వహించడంతో పాటు కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి తెలుగు టైటిల్ 'బాక్' (Baak) తమన్నా భాటియా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashi Khanna) ప్రధాన పాత్రలు పోషించగా, వెన్నెల కిషోర్ (Vennela Kishore ), శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

rashi.jpeg

మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా సుందర్ సి, తమన్నా భాటియా (Tamannaah Bhatia)పాత్రలను పరిచయం చేశారు. ఈ రోజు రాశీఖన్నా (Raashi Khanna), వెన్నెల కిషోర్‌ల ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లను విడుదల చేశారు. రెండు పోస్టర్లలో హాంటెడ్ హౌస్ నేపథ్యంలో భయానకంగా ఉంది. రాశి ఖన్నా టెర్రిఫైడ్ గా కనిపించగా, వెన్నెల కిషోర్ (Vennela Kishore ) కూడా టెన్షన్‌ పడతూ కనిపించారు.

vennela.jpeg


అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్ (Khushbu Sundar), ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో విడుదల చేయనుంది. హిప్హాప్ తమిళా సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్.

baak.jpeg

Updated Date - Apr 11 , 2024 | 08:16 PM