Tamannaah: ‘బాక్’‌లో శివానిగా తమన్నా.. లుక్ అదిరింది

ABN , Publish Date - Apr 10 , 2024 | 10:06 PM

‘అరణ్మనై’ తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ, తెలుగులో విడుదలైన అన్ని వెర్షన్లు హిట్ అయ్యాయి. ఈ హారర్-కామెడీ సిరీస్ నాల్గవ ఫ్రాంచైజీ తెలుగులో ‘బాక్’ పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుండి తమన్నా, సుందర్ సి లుక్స్‌ని విడుదల చేశారు.

Tamannaah: ‘బాక్’‌లో శివానిగా తమన్నా.. లుక్ అదిరింది

‘అరణ్మనై’ (Aranmanai) తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ, తెలుగులో విడుదలైన అన్ని వెర్షన్లు హిట్ అయ్యాయి. ఈ హారర్-కామెడీ సిరీస్ నాల్గవ ఫ్రాంచైజీ తెలుగులో ‘బాక్’ (Baak) పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి సుందర్ సి (Sundar C) దర్శకత్వం వహించారు. అవ్ని సినిమాక్స్ పి లిమిటెడ్ పతాకంపై ఖుష్బు సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో సుందర్ సి హీరోగా నటిస్తుండగా.. తమన్నా భాటియా (Tamannaah Bhatia), రాశి ఖన్నా (Raashi Khanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేయడంతో తెలుగు ప్రమోషన్స్ మొదలయ్యాయి.

*Rathnam: ‘చెబుతావా'.. విశాల్ ‘రత్నం’ నుంచి మరో పాటొచ్చింది


Sundar-C.jpg

తమన్నాని శివాని (Shivani)గా పరిచయం చేస్తూ.. ఆమె లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్‌లో తమన్నా.. సాంప్రదాయ గెటప్‌లో కనిపిస్తుంది. సుందర్ సి శివశంకర్‌ (Siva Shankar)గా పరిచయం కాగా, అతని క్యారెక్టర్ పోస్టర్‌లో అనుమానాస్పదంగా కనిపిస్తున్నారు. రెండు పోస్టర్లు బాక్‌లో కొన్ని స్పైన్ చిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. హిప్‌హాప్ తమిళా (Hiphop Tamizha) సంగీతం అందించగా, ఇ కృష్ణమూర్తి సినిమాటోగ్రఫీ, ఫెన్నీ ఆలివర్ ఎడిటింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. గురురాజ్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రం తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఏపీ, తెలంగాణ‌లో భారీ విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tamannaah.jpg


ఇవి కూడా చదవండి:

====================

*Devara: ‘లైగర్’ నిర్మాత చేతికి ‘దేవర’.. ఆ చిక్కులు తప్పవా!

*********************

*Vettaiyan: కమల్ హాసనే కాదు.. రజినీకాంత్ కూడా అప్డేట్ ఇచ్చాడు..

****************************

Updated Date - Apr 10 , 2024 | 10:06 PM