Ananya: ‘అనన్య’ విడుదలకు రెడీ..

ABN , Publish Date - Mar 14 , 2024 | 04:11 PM

జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా.. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘అనన్య’. జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది.

Ananya: ‘అనన్య’ విడుదలకు రెడీ..
Ananya Movie Pre Release Event

జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ ముఖ్య తారాగణంగా.. ప్రసాద్ రాజు బొమ్మిడి దర్శకత్వంలో శ్రీ సిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘అనన్య’ (Ananya). జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో తాజాగా ‘అనన్య’ ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో మేకర్స్ ఘనంగా నిర్వహించారు. (Ananya Pre Release Event)

ఈ వేడుకలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటుడు సుమన్, యువ కథానాయకుడు సందీప్ మాధవ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకనిర్మాత సాయి వెంకట్, విశ్రాంత న్యాయమూర్తి మాల్యాద్రి, శ్రీనివాస్ బోగిరెడ్డి, యువ దర్శకుడు అఫ్జల్‌తోపాటు ఇతర యూనిట్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘అనన్య’ అద్భుతమైన విజయం సాధించాలని ఈ సందర్భంగా హాజరైనవారంతా అభిలషించారు. (Ananya Movie)


Ananya-pic.jpg

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ‘అనన్య’ చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరించి తమ బ్యానర్‌కు శుభారంభాన్నిస్తుందని నిర్మాత జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ (Uma Naga Siva Gangadhara Sharma) పేర్కొన్నారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుని, ఈనెల 22న వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలు సైతం పుష్కలంగా పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు ప్రసాద్ రాజు బొమ్మిడి (Prasad Raju Bommidi) తెలిపారు. తమ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పిన హీరో శ్రీకాంత్‌కు దర్శకనిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

====================

*AM Rathnam: పవన్ కళ్యాణ్‌పై ‘హరిహర వీరమల్లు’ నిర్మాత పోస్ట్ వైరల్

*****************************

*Vishwak Sen: మా సినిమాని కూడా చూసి.. నలుగురు పెద్ద మనుషులు మాట్లాడండి

************************

*Kubera: శేఖర్ కమ్ములతో కింగ్ నాగ్ మంతనాలు.. ఫొటో వైరల్

*****************************

*Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను

***************************

Updated Date - Mar 14 , 2024 | 04:11 PM