Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను

ABN , Publish Date - Mar 13 , 2024 | 10:17 AM

రీసెంట్‌గా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న చిన్న సినిమా ‘ప్రేమలు’పై సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూస్తూ హాయిగా నవ్వుకున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’.. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను కార్తికేయ టాలీవుడ్‌లో మార్చి 8న విడుదల చేశారు.

Mahesh Babu: చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వాను
Super Star Mahesh Babu

రీసెంట్‌గా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న చిన్న సినిమా ‘ప్రేమలు’ (Premalu)పై సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ప్రశంసల వర్షం కురిపించారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూస్తూ హాయిగా నవ్వుకున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న విడుదలైన మలయాళ చిత్రం ‘ప్రేమలు’ (Premalu Movie).. అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ మూవీకి మంచి ప్రశంసలు దక్కాయి. మంచి కామెడీ, లవ్ అనే అంశాలతో ‘ప్రేమలు’ సినిమా స్టోరీ లైన్, దాన్ని తెరకెక్కించిన విధానాన్ని ప్రేక్షకులు అద్భుతమని మెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ అందించారు. శుక్రవారం (మార్చి 8) విడుదలైన ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు.. విడుదలైనప్పటి నుండి చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన ప్రముఖులెందరో ఈ సినిమాను కొనియాడుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా సినిమాను, సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించిన కార్తికేయ (SS Karthikeya)ను అభినందించారు.

‘‘తెలుగు ప్రేక్షకులకు ‘ప్రేమలు’ చిత్రాన్ని అందించిన కార్తికేయకు ధన్యవాదాలు. బాగా ఎంజాయ్ చేశాను. చివరిగా నేను ఏ సినిమా చూసి ఇలా ఎంజాయ్ చేశానో గుర్తు లేదు. ఫ్యామిలీ మొత్తానికి ఈ సినిమా బాగా నచ్చింది. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన నటనను కనబరిచారు. టీమ్ మొత్తానికి నా అభినందనలు’’ అని సూపర్ స్టార్ మహేష్ బాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు లైక్స్, కామెంట్స్‌కి అయితే లెక్కే లేదు. ఒక మంచి సినిమాను ప్రమోట్ చేయడానికి, ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు చేరవేయడానికి మహేష్ బాబు ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారంటూ.. అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. (Mahesh Babu Praises on Premalu Movie)


Mahesh.jpg

ప్రస్తుతం మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. SSMB29గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. త్వరలోనే సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. మహేష్ బాబు (#MaheshBabu) కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందనేలా వార్తలు వినిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Manchu Manoj: కవల పిల్లలపై క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్.. ట్విస్ట్ ఏమిటంటే?

**************************

*Trisha: చిరు ఇచ్చిన గిఫ్ట్‌తో మురిసిపోతోన్న త్రిష.. ఇంతకీ చిరు ఏమిచ్చారంటే..

**************************

Updated Date - Mar 13 , 2024 | 10:17 AM