Bachchala Malli: అల్లరోడి ‘బచ్చల మల్లి’ ఫెరోషియస్ ఫస్ట్ లుక్..

ABN , Publish Date - May 28 , 2024 | 02:11 PM

అల్లరి నరేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. అల్లరి నరేష్ అప్ కమింగ్ మూవీ ‘బచ్చల మల్లి’లో ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో.. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Bachchala Malli: అల్లరోడి ‘బచ్చల మల్లి’ ఫెరోషియస్ ఫస్ట్ లుక్..
Allari Naresh In Bachchala Malli

‘ఆ ఒక్కటీ అడక్కు’ తర్వాత హీరో అల్లరి నరేష్ (Allari Naresh) తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. అల్లరి నరేష్ అప్ కమింగ్ మూవీ ‘బచ్చల మల్లి’ (Bachchala Malli)లో ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి (Subbu Mangadevi) దర్శకత్వంలో.. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను నిర్మించిన హాస్య మూవీస్ (Hasya Movies) బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ (Bachchala Malli Ferocious First Look Poster)ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

*NTR Jayanthi: ‘భారతరత్న’.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

అల్లరి నరేష్ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో మ్యాసీ హెయిర్, గడ్డంతో ఈ ఫస్ట్ లుక్‌లో కనిపిస్తున్నారు. నరేష్ ఇంటెన్స్ సీరియస్ లుక్‌లో రిక్షా మీద కూర్చుని సిగరెట్ తాగుతూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో బాణసంచా కాల్చడం, ఫెరోషియస్ దేవుళ్ల గెటప్‌లతో కూడిన కార్నివాల్‌ను గమనించవచ్చు. హై-వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్‌ అన్నట్లుగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తుంటే.. ‘బచ్చల మల్లి’ సినిమా ఇంటెన్స్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనేది అర్థమవుతోంది. (Bachchala Malli First Look Out)


Bachchala-Malli.jpg

అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ (Amritha Aiyer) కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రాండ్ స్కేల్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ‘సీతా రామం’ ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. ‘మానాడు, రంగం, మట్టి కుస్తి’ చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డివోపీగా పని చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. ప్రస్తుతం ఈ సినిమా ఆర్ఎఫ్‌సిలో వేసిన సెట్‌లో హీరో ఎమోషనల్ జర్నీ 1990 బ్యాక్ డ్రాప్ తాలుకూ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.

Read Latest Cinema News

Updated Date - May 28 , 2024 | 02:11 PM