Allari Naresh: అవి కామెడీ రోల్స్.. ఇది సీరియస్ రోల్

ABN , First Publish Date - 2023-05-04T20:33:07+05:30 IST

నన్ను ఎలా పిలుస్తారో తెలీదు కానీ ఈ ఉగ్రం మాత్రం ఒక ప్రత్యేకమైన సినిమాగా అలరిస్తుంది. ‘నాంది’ చేసినపుడు ఎంత గర్వంగా

Allari Naresh: అవి కామెడీ రోల్స్.. ఇది సీరియస్ రోల్
Allari Naresh

‘నాంది’ (Naandhi) వంటి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన చిత్రం ‘ఉగ్రం’ (Ugram). ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో అల్లరి నరేష్ (Allari Naresh), డైరెక్టర్ విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) మరోసారి పవర్ ఫుల్ మూవీతో వస్తున్నారనేలా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ చిత్రం మే 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అల్లరి నరేషన్ సరసన మిర్నా మీనన్ కథానాయికగా నటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి జరిగిన మీడియా సమావేశంలో అల్లరి నరేష్ చిత్ర విశేషాలను తెలియజేశారు. (Allari Naresh Ugram Interview)

‘అల్లరి’ నరేష్‌గా చూశారు.. ఉగ్రంతో ‘ఉగ్రం’ నరేష్ అనే పిలిచే స్థాయి ఈ సినిమాతో వస్తుందా?

నన్ను ఎలా పిలుస్తారో తెలీదు కానీ ఈ ఉగ్రం మాత్రం ఒక ప్రత్యేకమైన సినిమాగా అలరిస్తుంది. ‘నాంది’ చేసినపుడు ఎంత గర్వంగా అనిపించిందో ‘ఉగ్రం’ కూడా అలానే అనిపించింది.

కామెడీ నటులు సీరియస్ పాత్రలు చేసినపుడు ప్రేక్షకుల ఆదరణ ఆ స్థాయిలో ఉంటుందంటారా?

కామెడీని మనం చిన్న చూపు చూస్తాం. కానీ కామెడీ చేసిన వాళ్ళు ఏదైనా చేస్తారు. నవరసాల్లో కష్టమైనది హాస్యం. నవ్వించడం కష్టం .. ఏడిపించడం సులువు. (Ugram Press Meet)

Ugram-1.jpg

ఈ పాత్ర చేయడం ఎలా అనిపించింది?

దర్శకుడు విజయ్ టాస్క్ మాస్టర్. ముందే నా బలాలు, బలహీనతలు చెప్పారు. పాత నరేష్ ఎక్కడ కనిపించకూడదని చెప్పారు. విజయ్ ఏం చెప్పారో అది చేశాను. తను యాక్ట్ చేసి మరీ చూపించారు.

ఒక్కసారిగా సీరియస్ పాత్రలు వైపు రావడానికి కారణం?

నటుడిగా పేరుతెచ్చుకోవాలని నాకూ వుంటుంది. అలాగే కొత్తదనం కూడా ప్రయత్నించాలి. గమ్యం, శంభో శివ శంభో, మహర్షి చిత్రాలు కొత్తదారిలో వెళ్ళడానికి నమ్మకాన్ని ఇచ్చాయి. ఆ క్రమంలోనే నాంది వచ్చింది. ఇప్పుడు ఉగ్రం వస్తోంది. (Allari Naresh Interview)

ఈ సినిమాలో యాక్షన్ ఎలివేషన్స్ కొత్తగా కనిపిస్తున్నాయి?

గతంలో కూడా ఫైట్లు చేశాను. అయితే అవి నవ్వించడానికి. ఇందులో మాత్రం ఎమోషన్ వేరు. ఇందులో యాక్షన్స్ సీన్స్ అన్నీ నేచురల్‌గా వుంటాయి. ముందుగా రిహార్సల్ చేయడం యాక్షన్‌కి చాలా కలిసొచ్చింది.

సీరియస్ పోలీస్ అధికారిగా చేయడం ఎలా అనిపించింది?

పోలీస్ (Police) గెటప్‌లో చేసిన బ్లేడ్ బాబ్జీ, కితకితలు మంచి విజయాలు సాధించాయి. అయితే అవి కామెడీ రోల్స్. ఉగ్రంలో సీరియస్ రోల్. చాలా నిజాయితీగా చేసిన సినిమా. ఇందులో తొలిసారి ఉగ్రం రూపంలో కనిపిస్తున్నా.

‘ఉగ్రం’ సక్సెస్ రేట్ ఎంత వుంటుంది?

మొన్న సినిమా చూశాను. నా హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుందని అనుకుంటున్నాను.

ఇవి కూడా చదవండి:

************************************************

*Vanitha Vijay Kumar: రిలేషన్‌ మాత్రమే.. పెళ్ళి జరగలేదు.. దయచేసి అలా రాయవద్దు

*Parineeti and Raghav: క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హల్చల్

*Nandi Awards: నంది అవార్డుల వివాదంపై మంత్రి తలసాని రియాక్షన్ ఇదే..

*Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?

*Vijay Antony: నా ప్రాణాలను నా హీరోయిన్‌ కాపాడింది

*Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి

Updated Date - 2023-05-04T20:33:07+05:30 IST