Allari Naresh : కొన్నిసార్లు అంతే అనుకున్నవి జరగవు

ABN , First Publish Date - 2023-10-20T15:44:01+05:30 IST

శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'. శ్రీ భారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను అల్లరి నరేష్‌ విడుదల చేశారు.

Allari Naresh :  కొన్నిసార్లు అంతే అనుకున్నవి జరగవు

శ్రీరామ్‌ నిమ్మల, కలపాల మౌనిక జంటగా నటిస్తున్న చిత్రం 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'. శ్రీ భారత ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.సందీప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను అల్లరి నరేష్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'అనుకున్నవన్ని జరగవు కొన్ని’ టైటిల్‌ లాంచ్  చేయడం ఆనందంగా ఉంది. పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు నేను నటించిన 'సిల్లీ ఫెలోస్‌’ చిత్రానికి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా విజయవంతమై టీమ్‌ అందరికీ మంచి పేరు రావాలి. దర్శకుడిగా సందీప్‌ బిజీ కావాలి’’ అని అన్నారు.

దర్శకుడు సందీప్‌ మాట్లాడుతూ ''దర్శకుడిగా తొలి చిత్రమిది. క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాం.  కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తారు. నవంబర్‌ 3న విడుదల కానున్న మా చిత్రాన్ని తప్పకుండా థియేటర్స్‌లో చూడండి’’ అని అన్నారు. 

Updated Date - 2023-10-20T15:45:20+05:30 IST