Kannappa: ‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్ పార్ట్ పూర్తయింది

ABN , Publish Date - May 03 , 2024 | 04:44 PM

హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రంలో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారంతా నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది. తాజాగా ఆయన షూటింగ్ పూర్తయినట్లుగా మంచు విష్ణు తెలియజేశారు.

Kannappa: ‘కన్నప్ప’లో అక్షయ్ కుమార్ పార్ట్ పూర్తయింది
Vishnu Manchu and Akshay Kumar

హీరో విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ (Kannappa) చిత్రంలో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో మోహన్ బాబు (Mohan Babu), మోహన్ లాల్ (Mohan Lal), శరత్ కుమార్ (Sarath Kumar), ప్రభాస్ (Prabhas), బ్రహ్మానందం (Brahmanandam) వంటి వారంతా నటిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని.. చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది. రీసెంట్‌గా అక్షయ్ కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయినట్లుగా కూడా మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా అక్షయ్ కుమార్ తన సీన్లకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసినట్లుగా చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. (Kannappa Latest Update)

*Kamakshi Bhaskarla: ‘మా ఊరి పొలిమేర 2’ లక్ష్మీకి దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్


‘అక్షయ్‌కుమార్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నో సార్లు కలవాలని కోరుకుంటున్నాను’ అని మంచు విష్ణు (Manchu Vishnu) సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని తెలియజేశారు. ప్రస్తుతం మంచు విష్ణు చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. మహాశివరాత్రి పర్వదినాన విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు సంబంధించి వస్తోన్న ప్రతి అప్‌డేట్‌తో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్‌ను ఆకర్షిస్తోంది.


Vishnu.jpg

‘కన్నప్ప’ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా మేకర్స్ తీర్చిదిద్దుతున్నారు. ధైర్యవంతుడైన యోధుడు, శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నారు. ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Read Latest Cinema News

Updated Date - May 03 , 2024 | 04:45 PM