Kannappa: వామ్మో.. మంచు విష్ణు అద‌ర‌గొట్టాడుగా!

ABN , First Publish Date - 2023-11-23T08:02:39+05:30 IST

మంచు విష్ణు కలల చిత్రం ‘భక్త కన్నప్ప’నుంచి గురువారం అదిరిపోయే అప్డేట్‌ వ‌చ్చింది. ఈరోజు (న‌వంబ‌ర్‌23) మంచు విష్ణు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మేక‌ర్స్‌ ముందుగా చెప్పిన ప్ర‌కార‌మే భారత కాలమాన ప్రకారం నవంబర్ 23న ఉదయం 2.45 గం.లకు, న్యూజిలాండ్‌లో 10.15గం.లకు సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

Kannappa: వామ్మో.. మంచు విష్ణు అద‌ర‌గొట్టాడుగా!
Kannappa FirstLook

మంచు విష్ణు (manchu Vishnu) కలల చిత్రం ‘భక్త కన్నప్ప’(Bhakta kannappa) నుంచి గురువారం అదిరిపోయే అప్డేట్‌ వ‌చ్చింది. ఈరోజు (న‌వంబ‌ర్‌23) మంచు విష్ణు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మేక‌ర్స్‌ ముందుగా చెప్పిన ప్ర‌కార‌మే భారత కాలమాన ప్రకారం నవంబర్ 23న ఉదయం 2.45 గం.లకు, న్యూజిలాండ్‌లో 10.15గం.లకు సినిమా ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఇందులో విష్ణు క‌న్న‌ప్ప వేశ‌ధార‌ణ‌లో ఉండ‌గా ఓ వైపు నుంచి బాణాలు త‌న పైకి దూసుకు వ‌స్తుంటే ఆయ‌న‌ ఆకాశంలోకి చూస్తు విల్లును ఎక్కుపెట్టి బాణాలు వేస్తున్న‌ట్లుగా ఉన్న ఫొటోతో ఫ‌స్ట్ లుక్ వ‌దిలారు. ఈ లుక్ చూసిన సినిమాను ఓ రేంజ్లోనే తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఆర్థ‌మ‌వుతున్న‌ది. ఈ అప్డేట్ తరువాత సినిమా మీద మరింతగా అంచనాలు పెరిగాయి.

శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్‌ మరియు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌ బాబు (Mohan babu) పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్‌ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్‌’ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శక‌త్వం చేస్తుండ‌గా , సీనియర్‌ రచయితలు పరుచూరి, బుర్ర సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ ఈ కథకు తుది మెరుగులు దిద్దారు. మణిశర్మ, స్టీఫెన్‌ దేవాసి సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌ తో, హై టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుంది.


అయితే ప్రతీ ఇండస్ట్రీలోని ఓ స్టార్ ఈ కన్నప్ప సినిమాలో పాలు పంచుకుంటుండటంతో జాతీయ స్థాయిలో ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, తమిళం నుంచి విలక్షణ నటుడు శరత్ కుమార్ వంటి వారంతా కన్నప్పలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడిగా, న‌య‌న‌తార పార్వ‌తిగా న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ చిత్రంలో మోహన్ బాబు సైతం ఓ కీ రోల్‌ను పోషిస్తున్నారు.

‘బాహుబలి, జవాన్, పొన్నియిన్ సెల్వన్’ వంటి భారీ ప్రాజెక్టు‌లకు ఫైట్స్ కంపోజ్ చేసిన అంతర్జాతీయ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెచా (Kecha Khamphakdee) ఇప్పుడీ సినిమాకు పోరాట సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా థాయ్‌లాండ్, హాంకాంగ్ వంటి దేశాల నుంచి 80 మంది ఫైటర్లు ఈ సినిమా కోసం పనిచేయబోతున్నారని స‌మాచారం. ఇదిలాఉండ‌గా ఇక ఈ సినిమాలో ముందుగా నుపుర్ సనన్ (NipurSanon) ని కథానాయకురాలుగా ఎంపిక చేయ‌గా కానీ ఆమె తేదీలు కుదరక ఈ సినిమా నుండు తప్పుకుంది. ఆమెకి బదులుగా వేరే నటిని ఇంకా ఎంపిక చేసే ప‌నిలో చిత్ర యూనిట్ ఉన్న‌ది.

Updated Date - 2023-11-23T08:06:46+05:30 IST