Kamakshi Bhaskarla: ‘మా ఊరి పొలిమేర 2’ లక్ష్మీకి దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్

ABN , Publish Date - May 02 , 2024 | 04:39 PM

తాజాగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా. కామాక్షి భాస్కర్ల చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది.

Kamakshi Bhaskarla: ‘మా ఊరి పొలిమేర 2’ లక్ష్మీకి దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డ్
Heroine Kamakshi Bhaskarla

తాజాగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024 (14th Dada Saheb Phalke Film Festival 2024)లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా. కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2)లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు. అలాగే అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎంపిక కావటం విశేషం.

*Aditi Rao Hydari: అందుకే ఎంగేజ్‌మెంట్‌ గురించి బయటకు చెప్పా


ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. ‘మా ఊరి పొలిమేర 2’ సినిమాలోని నటనకుగానూ నాకు ఉత్తమ నటిగా అవార్డు రావటం.. థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవార్డు నటిగా నా బాధ్యతను మరింతగా పెంచిందని భావిస్తున్నాను. ఈ సందర్భంగా సమహార థియేటర్‌లో నాకు నటనను నేర్పించిన మా గురువుగారు రత్న శేఖర్‌గారికి, నీజర్ కబిగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన ప్రేక్షకులకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసి, ఈ అవార్డు రావటానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నానని చెప్పుకొచ్చారు. (Kamakshi Bhaskarla Wins Best Actress Award at 14th Dada Saheb Phalke Film Festival 2024)


Kamakshi-Bhaskarla.jpg

ఇదే సందర్భంలో ‘మా ఊరి పొలిమేర 2’లో తను చేసిన పాత్ర గురించి, సినిమా గురించి కామాక్షి మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మాకుంది. అయితే అవార్డులు వస్తాయని మాత్రం ఊహించలేదు. ఎంటైర్ టీమ్ ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఓ టీమ్‌గా మేం ఇంత వరకు చేసిన ప్రయాణంతో పాటు ఇతర భాషా ప్రేమికులు సినిమా కంటెంట్‌ను ఎలా ఆదరిస్తున్నారో చూడటం ఆనందంగా ఉంది. ‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించటమే కాకుండా ప్రేక్షకుల, విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. అందుకనే ఈ ప్రతిష్టాత్మక అవార్డు నా మనసులో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అని పేర్కొంది కామాక్షి భాస్కర్ల.

Read Latest Cinema News

Updated Date - May 02 , 2024 | 04:39 PM