మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CD Trailer: ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:01 PM

అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తున్న ఆమె చేస్తున్న మరో వెరైటీ చిత్రం CD. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Adah Sharma in CD

అదా శర్మ (Adah Sharma) ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అవుతోంది. ఆమె నటించిన సినిమాలు వరుస బ్లాక్ బస్టర్ హిట్లవుతూ అదా శర్మను నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ ముందుకు వస్తున్న ఆమె నటిగానూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంటోంది. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో ప్రయోగాలు చేస్తున్న అదా శర్మ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తోంది. ఆ సినిమా పేరే ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ (CD Movie). ది కేర‌ళ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. (CD Movie Trailer Out)

*Tamannaah Bhatia: డబ్బులు కోసం చూసుకోకుండా ఒప్పుకుంటే చిక్కులు తప్పవు మరి


ట్రైలర్ విషయానికి వస్తే.. ‘చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు.. ఎవరు చేస్తున్నారు ఇదంతా?.. నా చుట్టూ ఏదో జరుగుతోంది.. నాతో పాటు ఇంట్లో ఉంటోంది దెయ్యమా?.. మరణంతో పాటు యుద్దం తప్పదా?.. నన్ను చంపడానికి వచ్చింది ఎవరు.. క్రిమినల్? ఆర్ డెవిల్?’ అంటూ హీరో విశ్వంత్ (Viswant) వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ మొదలైంది. ఇక ఈ ట్రైలర్‌లో అదా శర్మ యాక్షన్ సీక్వెన్స్, భయపెట్టేలా చూసే చూపులతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పొచ్చు. అలాగే విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


C.D (క్రిమినల్ ఆర్ డెవిల్ Criminal or Devil) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి గిరిధర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 10న చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Apr 27 , 2024 | 05:13 PM