Devil Glimpse: గూఢచారి‌కి ఉండాల్సిన ముఖ్యలక్షణం ఏమిటో.. కళ్యాణ్ రామ్ మాటల్లో..!

ABN , First Publish Date - 2023-07-05T16:42:01+05:30 IST

రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నమైన పంథాలో నడిచే హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. ‘బింబిసార’ సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు మరోసారి అటువంటి చిత్రంతోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని.. ఆయన హీరోగా నటిస్తున్న ‘డెవిల్’ చిత్ర గ్లింప్స్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.

Devil Glimpse: గూఢచారి‌కి ఉండాల్సిన ముఖ్యలక్షణం ఏమిటో.. కళ్యాణ్ రామ్ మాటల్లో..!
Kalyan Ram in Devil Movie

రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నమైన పంథాలో నడిచే హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఒకరు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా.. ఆయన చేసే సినిమాలు వైవిధ్యతను సంతరించుకుని ఉంటాయి. ఇప్పుడలాంటి వైవిధ్యభరిత చిత్రంతోనే కళ్యాణ్ రామ్ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకు ముందు ‘బింబిసార’ (Bimbisara) చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కళ్యాణ్ రామ్.. ఈసారి పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ‘డెవిల్’ (Devil) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బుధవారం (జూలై 05) కళ్యాణ్ రామ్ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్.. ‘డెవిల్’ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ (Devil Glimpse)ని విడుదల చేశారు. నవీన్ మేడారం (Naveen Medaram) అనే దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. టాలీవుడ్‌లో టాప్ నిర్మాణ సంస్థగా దూసుకెళుతోన్న అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో ఉండే ఒక సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ ఇందులో కనబడుతున్నారు. ఈ చిత్ర గ్లింప్స్ ఎలా ఉందంటే.. (Devil Glimpse Talk)

కళ్యాణ్ రామ్‌కు మరో ‘బింబిసార’ అయ్యే లక్షణాలు గ్లింప్స్‌లో కనిపిస్తున్నాయి. కళ్యాణ్ రామ్ ఇందులో సీరియస్ లుక్‌లో.. మరోసారి విభిన్నమైన పాత్రతో అలరించబోతున్నాడనే విషయం ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అన్నీ కూడా మరో హిట్ సినిమా కళ్యాణ్ రామ్ అకౌంట్‌లో పడబోతుందనేలా సంకేతాలను ఇస్తున్నాయి. కాకపోతే గ్లింప్స్ చివరిలో వచ్చే మ్యూజిక్.. ఇటీవల సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ (Virupaksha) మెయిన్ థీమ్ మ్యూజిక్‌లా అనిపిస్తుంది. ‘మీరు చెప్పేదానికి, చేసేదానికి, ఆలోచించేదానికి అసలు సంబంధం ఉండదేంటి సార్..’ అని సత్య పాత్ర అడిగితే.. ‘‘మనసులో ఉన్న భావన.. ముఖంలో తెలియకూడదు. మొదడులో ఉన్న ఆలోచన.. మాటల్లో బయటపడకూడదు. అదే.. గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం’’ అని కళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్.. ఆయన కంఠంలోని గాంభీర్యం.. ఈ సినిమాకు ‘డెవిల్’ అనే పేరు ఎందుకు పెట్టారనే విషయాన్ని తెలియజేస్తుంది. మొత్తంగా అయితే.. టాలీవుడ్ సత్తాని మరోసారి చాటే చిత్రంగా ఈ సినిమా ఉండబోతుందనేది.. ఈ గ్లింప్స్‌తోనే క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

‘బింబిసార’ తర్వాత మరోసారి కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆమెకు సంబంధించిన లుక్‌ని కూడా ఈ గ్లింప్స్‌లో రివీల్ చేశారు. ప్రస్తుతం సంయుక్తా మీనన్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక పాన్ ఇండియా (Pan India) సినిమాగా ప్రపంచవ్యాప్తంగా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని దేవాన్ష్ నామా (Devansh Nama) సమర్పణలో అభిషేక్ నామా (Abhishek Nama) నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Sekhar Chandra: ఆ పాటకి 3 కోట్ల వ్యూస్.. ఆనందంలో సంగీత దర్శకుడు

**************************************

*Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*Bharatheeyans: మనం చైనాకు లొంగిపోతున్నామా?.. ‘భారతీయన్స్’ నిర్మాత ఆవేదన

**************************************

Updated Date - 2023-07-05T16:42:01+05:30 IST