Sekhar Chandra: ఆ పాటకి 3 కోట్ల వ్యూస్.. ఆనందంలో సంగీత దర్శకుడు

ABN , First Publish Date - 2023-07-04T21:56:15+05:30 IST

యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా కోసం శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ‘నిజమే నే చెబుతున్నా’ సాంగ్ 3 కోట్ల వ్యూస్ సాధించి.. శ్రోతలను ఎంతగానో అలరిస్తోంది. ఆ పాటకు వస్తున్న రెస్పాన్స్‌కి సంగీత దర్శకుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర దర్శకనిర్మాతలకు, పాట రాసిన శ్రీమణికి, పాటని ఆలపించిన సిద్ శ్రీరామ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Sekhar Chandra: ఆ పాటకి 3 కోట్ల వ్యూస్.. ఆనందంలో సంగీత దర్శకుడు
Sekhar Chandra about Ooru Peru Bhairavakona Song

బ్యాక్ టూ బ్యాక్ చార్ట్‌బస్టర్స్ హిట్ సాంగ్స్ డెలివేరీ చేస్తూ టాలీవుడ్ సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు శేఖర్ చంద్ర (Shekar Chandra). తాజాగా యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona) సినిమా కోసం శేఖర్ చంద్ర కంపోజ్ చేసిన ఓ సాంగ్ 3 కోట్ల వ్యూస్ సాధించి.. శ్రోతలకు ఎంతగానో అలరిస్తోంది. ఆ పాటకు వస్తున్న రెస్పాన్స్‌కి సంగీత దర్శకుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ ఆ పాట ఏదంటే.. సందీప్ కిషన్ (Sundeep Kishan), వర్ష బొల్లమ్మ (Varsha Bollamma)లపై చిత్రీకరించిన ‘నిజమే నే చెబుతున్నా’ (Nijame Ne Chebutunna) లవ్ సాంగ్ యూట్యూబ్‌లో 30 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. అలాగే ఇన్‌స్టాలో రీల్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది. శేఖర్ చంద్ర స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ పాడారు.

శేఖర్ చంద్ర, సిద్ శ్రీరామ్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’, ‘ప్రియతమా ప్రియతమా’, ‘మనసు దారి తప్పేనే’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన నాలుగవ సాంగ్ ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో శేఖర్ చంద్ర స్వరపరిచిన ‘నిజమే చెబుతున్నా’ సాంగ్ వైరల్ అవుతూ మ్యూజిక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకోవడంతో పాటు ఈ సాంగ్ సినిమాపై కూడా మంచి బజ్ తీసుకొచ్చింది.

ఈ పాట ఇంత బ్లాక్‌బస్టర్ అయిన క్రమంలో సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ‘‘నిజమే చెబుతున్నా.. సాంగ్ ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ సాంగ్‌ని ఓన్ చేసుకుంటూ రీల్స్ చేస్తున్న అందరికీ థ్యాంక్స్. ఈ పాట రిలీజయ్యాక చాలా మెసేజెస్ వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు విఐ ఆనంద్‌ (VI Anand)గారికి స్పెషల్ థాంక్స్. ఆయనతో నాకు ఇది రెండో సినిమా. మా కాంబోలో ఇంకా మరిన్ని మంచి పాటలు వస్తాయి. అలాగే హీరో సందీప్ కిషన్‌కి, నిర్మాతలకు థ్యాంక్స్. సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. మా కాంబోలో మరిన్ని సాంగ్స్ రానున్నాయి. ఈ పాటకు శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. ఈ సందర్భంగా శ్రీమణి (Shree Mani)కి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ పాటకి ఇంకా ఎక్కువ రీచ్ వస్తుందని నమ్ముతున్నాను..’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Tejaswini Pandit: తినటానికి తిండి లేక.. ‘ఆదిపురుష్’ శూర్పణఖ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*Bharatheeyans: మనం చైనాకు లొంగిపోతున్నామా?.. ‘భారతీయన్స్’ నిర్మాత ఆవేదన

**************************************

*Animal: ‘యానిమల్’ వాయిదా.. కారణం చెప్పిన ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు

**************************************

*Anushka Shetty: ఆగస్ట్ రిలీజ్ లిస్ట్‌లోకి అనుష్క సినిమా..

**************************************

*Bandla Ganesh: పవర్‌స్టార్‌ పేరు చెప్పుకుని లబ్ధి పొందను.. నా చూపు, నా ఆశ ఒకటే..

**************************************

*Sudigali Sudheer: ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం.. నిజమేనా?

**************************************

Updated Date - 2023-07-04T22:02:17+05:30 IST