Rashmika Mandanna: ఎలా, ఎప్పుడు, ఎందుకు.. ఇదంతా జరిగింది? రష్మిక పోస్ట్ వైరల్

ABN , Publish Date - Dec 30 , 2023 | 01:37 PM

నేషనల్ క్రష్‌గా వరుస సినిమాలతో దూసుకెళుతూ.. అగ్ర హీరోయిన్‌గా స్థానం పదిలం చేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్, షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతున్నాయి. ఎందుకని అనుకుంటున్నారా? ఈ ఫొటోలో ఆమె కిక్ ఎక్కించే విధంగా ఉంటే.. చేసిన పోస్ట్‌లో మ్యాటర్ కూడా అలాగే ఉంది. నటిగా కెరీర్ మొదలు పెట్టి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రష్మిక తన సంతోషాన్ని పంచుకుంది.

Rashmika Mandanna: ఎలా, ఎప్పుడు, ఎందుకు.. ఇదంతా జరిగింది? రష్మిక పోస్ట్ వైరల్
Rashmika Mandanna

నేషనల్ క్రష్‌ (National Crush)గా వరుస సినిమాలతో దూసుకెళుతూ.. అగ్ర హీరోయిన్‌గా స్థానం పదిలం చేసుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్, షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతున్నాయి. ఎందుకని అనుకుంటున్నారా? ఈ ఫొటోలో ఆమె కిక్ ఎక్కించే విధంగా ఉంటే.. చేసిన పోస్ట్‌లో మ్యాటర్ కూడా అలాగే ఉంది. నటిగా కెరీర్ మొదలు పెట్టి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎలా జరిగింది? అని ఆశ్చర్యపోతున్నట్లుగా రష్మిక తన పోస్ట్‌లో చెప్పుకొచ్చింది.

‘‘కొన్నిసార్లు వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఎలా ఇదంతా జరిగింది? ఎప్పుడు ఇదంతా జరిగింది? ఎందుకు ఇదంతా జరిగింది? అని అనిపిస్తుంది. కానీ ఇదంతా జరిగినందుకు మాత్రం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇదంతా నేను ఎప్పటి నుండో కలలు కనేదే. ఏం జరుగుతుందనేది తెలియకుండానే పరుగులు తీయడం మొదలు పెట్టాను. కానీ, సరైన వ్యక్తులతో ఉండడం వల్ల ఆలోచించి అడుగులు వేయగలిగాననే విషయాన్ని మాత్రం ఆగి తెలుసుకోవాలి. ఇది అదే. చిన్నప్పటి నుండి నేను కలలు కంటూ పెరిగింది దీని కోసమే..’’ (Rashmika Mandanna Social Media Post) అని రష్మిక తన ఏడేళ్ల సినీ ప్రయాణాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నారు.


Rashmika.jpg

ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ లైక్స్, రీ ట్వీట్స్, కామెంట్లతో వైరల్‌గా మారింది. ట్విట్టర్, ఇన్‌స్టా కలిపి సుమారు 20 లక్షల లైక్స్ ఆమె పోస్ట్‌కు రావడం విశేషం. ఆమె సినీ ఇండస్ట్రీలో ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కన్నడలో 2016లో చేసిన ‘కిరిక్ పార్టీ’ చిత్రంతో నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రష్మిక. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా వరుసగా అన్ని ఇండస్ట్రీలను చుట్టేస్తూ.. స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ.. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. రీసెంట్‌గా ఆమె నటించిన ‘పుష్ప’ (Pushpa), ‘యానిమల్’ (Animal) చిత్రాలు విశేష ఆదరణను చూరగొన్నాయి. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2’, ‘రెయిన్ బో’ వంటి చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*King Nagarjuna: సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కింగ్ నాగ్

****************************

*Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లికి అంతా సిద్ధం.. గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడంటే?

***************************

*Kalyan Ram: రెండేళ్ల కష్టమిది.. అందరికీ థ్యాంక్స్

**************************

*Sai Pallavi: సాయిపల్లవి ఎంటరైంది..

****************************

Updated Date - Dec 30 , 2023 | 01:37 PM