Nagababu: కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి

ABN , Publish Date - Dec 30 , 2023 | 02:20 PM

నాగబాబు, రామ్ గోపాల్ వర్మల మధ్య మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. రీసెంట్‌గా వర్మ ఓ ఛానల్‌లో తనని టార్గెట్ చేస్తూ ప్రసారాలు చేశారని.. అందుకు సంబంధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాగబాబు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. నాగబాబు చేసిన పోస్ట్‌కు వర్మ కూడా అదే విధంగా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. వర్మ రిప్లైకి నాగబాబు మరోసారి స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు.

Nagababu: కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి
RGV Vs Nagababu

మెగా బ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu), రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ల మధ్య మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. రీసెంట్‌గా వర్మ ఓ ఛానల్‌లో తనని టార్గెట్ చేస్తూ ప్రసారాలు చేశారని.. అందుకు సంబంధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నాగబాబు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. నాగబాబు చేసిన పోస్ట్‌కు వర్మ కూడా అదే విధంగా ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు. వర్మ రిప్లైకి మరోసారి నాగబాబు థ్రెడ్స్ వేదికగా స్పందిస్తూ ‘కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ షాకింగ్‌గా స్పందించారు. (Naga Babu vs Ram Gopal Varma)

‘‘వర్మ గారు మీరు నా పోస్ట్‌కి స్పందించినందుకు చాల సంతోషంగా ఉంది కొంచెం షాక్‌కి కూడ గురయ్యాను. ఎందుకంటే మీరు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్లు దాటింది ఇంకా బతికున్నాను అనుకుని తిరుగుతున్నారు. మీ ఆత్మ మాత్రమే తిరుగుతోంది అది గ్రహించాలి మీరు, Any how ఏదోక రూపం లో నా పోస్ట్‌కి Answer ఇచ్చినందుకు సంతోషం, ఎప్పటికి మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను....’’ అని మెగాబ్రదర్ నాగబాబు థ్రెడ్స్‌లో పోస్ట్ చేశారు. (Naga Babu Post on RGV)


Nagababu.jpg

అంతకు ముందు.. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన వర్మను ఉద్దేశించి.. ‘‘ఆర్జీవీ గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు.. నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవీగారూ మీరేం భయపడకండి.. మీ జీవితానికి ఏ డోఖా లేదు. మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికిమాలిన వెధవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో, విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా.. మీరేం వర్రీ అవకండి. నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి. మీ శ్రేయోభిలాషి’’ అంటూ నాగబాబు పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు వర్మ స్పందిస్తూ.. ‘‘సార్ నా కన్నా పెద్ద కమెడియన్ ఎవడంటే.. నా సినిమాలో మీరు.. మీ తమ్ముడి దగ్గర డబ్బులడుక్కుని టీ తాగి పడుకోండి’’ అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లను చూసిన వారంతా.. మళ్లీ నాగబాబు, వర్మల మధ్య యుద్ధం మొదలైందిరో.. అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

====================

*Rashmika Mandanna: ఎలా, ఎప్పుడు, ఎందుకు.. ఇదంతా జరిగింది? రష్మిక పోస్ట్ వైరల్

****************************

*King Nagarjuna: సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కింగ్ నాగ్

****************************

*Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లికి అంతా సిద్ధం.. గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడంటే?

***************************

*Kalyan Ram: రెండేళ్ల కష్టమిది.. అందరికీ థ్యాంక్స్

**************************

Updated Date - Dec 30 , 2023 | 02:20 PM