King Nagarjuna: సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కింగ్ నాగ్

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:24 PM

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని (Revanth reddy) కింగ్ నాగార్జున తన భార్య అమల అక్కినేనితో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్‌‌లోని సీఎం నివాసంలో నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

King Nagarjuna: సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కింగ్ నాగ్
King Nagarjuna Couple Met CM Revanth Reddy

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy)ని కింగ్ నాగార్జున తన భార్య అమల అక్కినేని (Amala Akkineni)తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్‌‌లోని సీఎం నివాసంలో నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. రేవంత్‌రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్‌ నుంచి ముందుగా చిరంజీవి (Chiranjeevi) అభినందనలు తెలపడంతో పాటు.. రీసెంట్‌గా స్వయంగా తన ఇంటికి వెళ్లి ఆయనని అభినందించారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తర్వాత రేవంత్ రెడ్డిని కింగ్ నాగార్జున ఇలా మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు అభినందనలు తెలియజేశారు.


Revanth-Reddy.jpg

కాగా, నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 7న సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ రెండో సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకున్న రేవంత్‌ రెడ్డికి అన్ని వర్గాల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు ఎందరో.. సీఎం రేవంత్‌ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి తర్వాత నాగార్జున.. ఇలా ఒక్కొక్కరుగా పర్సనల్‌గా రేవంత్ రెడ్డిని వీలు చూసుకుని కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కింగ్ నాగార్జున, అమల (Nagarjuna and Amala Met CM Revanth Reddy) దంపతులు పుష్పగుచ్ఛంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మరి నెక్ట్స్ ఎవరు ఇండస్ట్రీ నుండి రేవంత్ రెడ్డిని కలవనున్నారో.. చూడాలి.


ఇవి కూడా చదవండి:

====================

*Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లికి అంతా సిద్ధం.. గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడంటే?

***************************

*Kalyan Ram: రెండేళ్ల కష్టమిది.. అందరికీ థ్యాంక్స్

**************************

*Sai Pallavi: సాయిపల్లవి ఎంటరైంది..

****************************

*Right: ఇయర్ ఎండింగ్‌లో బిగ్‌బాస్ ఫేమ్ కౌశల్ సందడి.. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే!

****************************

Updated Date - Dec 30 , 2023 | 12:32 PM