Hi Nanna in OTT: ‘హాయ్ నాన్న’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:35 PM

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ చిత్రం.. థియేటర్లలో మ్యాజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌‌గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ విడుదల తేదీని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది.

Hi Nanna in OTT: ‘హాయ్ నాన్న’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
Hi Nanna Movie Poster

నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ (Hi Nanna) చిత్రం.. థియేటర్లలో మ్యాజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌‌గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా జనవరి 4 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా.. సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. (Hi Nanna OTT Release Date)


Hi-Nanna.jpg

‘హాయ్ నాన్న’ కథ (Hi Nanna Movie Story) విషయానికి వస్తే..కథ ముంబైలో జరుగుతుంది, విరాజ్ (నాని) ముంబైలో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. అతనికి ఆరు సంవత్సరాల కుమార్తె మహి (బేబీ కియారా ఖన్నా) ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధితో బాధపడుతుంటుంది. అందుకని రాత్రిపూట పడుకునేటప్పుడు ఆక్సిజన్ పైప్ పెట్టుకొని పడుకుంటుంది. ఆ పాప అమ్మ కథ చెప్పమని తండ్రిని అడుగుతుంటుంది. క్లాస్ ఫస్ట్ వస్తే చెబుతానని ప్రామిస్ చేస్తాడు విరాజ్. మహి క్లాసు ఫస్ట్ వస్తుంది, ఆరోజు విరాజ్ పని ఒత్తిడిలో వుండి అమ్మ కథ చెప్పకుండా పాప మీద విసుక్కుంటాడు. తండ్రి మీద కోపంతో చెప్పా పెట్టకుండా బయటకు వెళుతుంది. అదే సమయంలో రోడ్ మీద పాపని ప్రమాదం నుండి యశ్న (మృణాల్ ఠాకూర్) కాపాడుతుంది. పాప, యష్ణ స్నేహితులు అవుతారు. కూతురు ఎక్కడికి వెళ్లిపోయిందో అనుకుంటున్న విరాజ్‌కి యశ్న ఫోన్ చేసి పాప క్షేమంగా ఉందని.. మీరు ఇక్కడికి రండి అని లొకేషన్ షేర్ చేస్తుంది. ఒక కాఫీ షాపులో ఇద్దరూ ఉంటే అక్కడికి విరాజ్ వెళతాడు. అప్పుడు అమ్మ కథ చెప్పాలని మహి పట్టుబట్టడంతో తన భార్య గురించి చెప్పడం మొదలు పెడతాడు విరాజ్. మహి తన అమ్మగా పక్కనే వున్న యశ్నని వూహించుకుంటుంది, యశ్న కూడా తనే వర్ష అని ఊహించుకొని ఇద్దరూ కథ వింటారు. వర్ష ఎవరు? వర్ష బ్యాక్‌డ్రాప్ ఏంటి? వర్షతో విరాజ్ పెళ్లి ఎలా జరిగింది? వర్ష ఏమైంది? వర్షకి, యశ్నకి ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఈ కథ ఎలా మలుపు తిరిగింది అనేదే.. ‘హాయ్ నాన్న’ కథ.


ఇవి కూడా చదవండి:

====================

*Nagababu: కీర్తిని కోల్పోయిన కీర్తిశేషులు వర్మ గారికి నా ప్రగాఢ సానుభూతి

**************************

*Rashmika Mandanna: ఎలా, ఎప్పుడు, ఎందుకు.. ఇదంతా జరిగింది? రష్మిక పోస్ట్ వైరల్

****************************

*King Nagarjuna: సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కింగ్ నాగ్

****************************

*Aamir Khan: ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లికి అంతా సిద్ధం.. గ్రాండ్ రిసెప్షన్ ఎక్కడంటే?

***************************

Updated Date - Dec 30 , 2023 | 03:35 PM