Pan India Stars: ఒకే స్టేజ్‌పై పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఎందుకో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-05-19T13:48:27+05:30 IST

ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan India Star Prabhas), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) హాజరు కాబోతున్నట్లుగా..

Pan India Stars: ఒకే స్టేజ్‌పై పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఎందుకో తెలిస్తే..!
Pan India Stars

పాన్ ఇండియా స్టార్స్ (Pan India Stars) అంతా ఇప్పుడు ఒకే స్టేజ్‌పై సందడి చేయబోతున్నారు. నిజంగా ఇది అభిమానులకు పండగలాంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ పండుగకి వేదిక కాబోతోంది ఎన్టీఆర్ శత జయంతి (NTR 100th Birthday Anniversary) ఉత్సవం. తెలుగు జాతి ఆత్మ గౌరవ శిఖరం, తెలుగువారి ఇలవేల్పు అయిన నందమూరి తారక రాముని శతజయంతి ఉత్సవాలు (NTR 100 Years Celebrations) అంగరంగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా విజయవాడలో జరిగిన ఈ ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ముఖ్య అతిథిగా హాజరైతే.. ఇప్పుడు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరగబోతోన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవానికి టాలీవుడ్‌ (Tollywood)లోని పాన్ ఇండియా స్టార్స్ హాజరు కాబోతున్నారు.

Pawan-Kalyan.jpg

TD. జనార్దన్-నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) కలిసి చేస్తున్న ఈ మెగా ఈవెంట్ మే 20న హైదరాబాద్, కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులోని ఖైతలాపూర్ గ్రౌండ్‌లో జరగబోతోంది. ఈ వేదికకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (Young Tiger NTR)ను స్వయంగా నందమూరి రామకృష్ణ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది.

Ram-Charan.jpg

ఎన్టీఆర్ ఒక్కరే కాదు.. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Power Star Pawan Kalyan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan India Star Prabhas), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Icon Star Allu Arjun) హాజరు కాబోతున్నట్లుగా కొన్ని ఫ్లెక్సీలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇంకా ఈ వేడుకకు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), జయప్రద (Jayapradha) వంటి వారు కూడా హాజరు కానున్నారని తెలుస్తోంది.

Jayapradha.jpg

ముందు ఈ వేడుకను హైదరాబాద్ LB స్టేడియంలో లేదంటే రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ.. చివరికి ఖైతలాపూర్ గ్రౌండ్‌‌ని ఫిక్స్ చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR) శత జయంతి ఉత్సవాలను గత 12 నెలలుగా నందమూరి ఫ్యామిలీ, అభిమానులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆయన పేరు మీద ప్రముఖులకు అవార్డులను ప్రదానం చేస్తూ వస్తున్నారు.

Balakrishna.jpg

ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగే వేడుకను భారీ స్థాయిలో నిర్వహించేలా ప్లాన్ చేయడమే కాకుండా.. ఈ వేడుకకు టాలీవుడ్‌లోని బిగ్ స్టార్స్ అందరినీ ఆహ్వానించడంతో.. చరిత్రలో మిగిలిపోయే ఈవెంట్‌గా ఇది మిగిలిపోతుందని నందమూరి అభిమానులు (Nandamuri Fans) భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*V Vijayendra Prasad: సీఎం కేసీఆర్‌ మిరాకిల్ క్రియేట్ చేశారు.. తెలంగాణ బిడ్డగా హ్యాపీ!

*Lal Salaam: క్రికెట్ లెజెండ్‌తో యాక్టింగ్ లెజెండ్.. పిక్ బహుత్ అచ్చా హై!

*Liger: ‘లైగర్’ ఎగ్జిబిటర్స్ దీక్ష విరమించారు.. ఎందుకో తెలుసా?

*Bro: ఫైనల్‌గా ‘PKSDT’ టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది

*Mrunal Thakur: వామ్మో.. ఈమె అసలు ‘సీతా రామం’ సీతేనా? ఆ ప్రదర్శన ఏంటసలు?

*Virupaksha: ఆ గమ్యాన్ని చేరుకుంది

Updated Date - 2023-05-19T13:59:26+05:30 IST