Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-09-27T18:39:50+05:30 IST

ఈ వినాయక చవితికి గణేష్ సాంగ్‌తో అలరించిన ‘భగవంత్ కేసరి’.. రాబోయే దసరాకి సినిమాతో ట్రీట్ ఇవ్వబోతున్నారు. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా.. శ్రీలీల ఓ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం, దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. గురువారం ఈ చిత్రం నుంచి ఓ సర్‌ప్రైజ్ వీడియోని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Bhagavanth Kesari: బాలయ్య ‘భగవంత్ కేసరి’ నుంచి స్పెషల్ సర్‌ప్రైజ్.. ఎప్పుడంటే?
Bhagavanth Kesari Set Pic

ఈ వినాయక చవితికి ఫస్ట్ సింగిల్ గణేష్ సాంగ్‌తో అలరించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari).. రాబోయే దసరాకి సినిమాతో ట్రీట్ ఇవ్వబోతున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) హీరోహీరోయిన్లుగా.. శ్రీలీల (Sreeleela) ఓ కీలక పాత్రలో నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ప్రస్తుతం మేకర్స్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ వీడియో (Special Surprise Video) రాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సర్‌ప్రైజ్ ఏంటనేది తెలియదు కానీ.. ఈ విషయం చెబుతూ.. ఓ పిక్‌ని మేకర్స్ వదిలారు. ఇందులో అనిల్ రావిపూడి మానేటర్‌ను దీర్ఘంగా చూస్తుండగా.. మానేటర్‌లో బాలయ్య వీర మాస్ అవతార్‌లో కనిపిస్తున్నారు. గురువారం సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు సర్‌ప్రైజ్‌ వీడియోను రివీల్ చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ అప్‌డేట్‌తో బాలయ్య ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా ఊపొచ్చింది. ఎందుకంటే.. రిలీజ్ దగ్గర పడుతోంది. యూనిట్ ప్రమోషన్స్ విషయంలో అంత హుషారుగా లేరనేలా టాక్ వినబడుతుండటంతో పాటు.. దసరాకి విడుదల కష్టమే అనేలా కొందరు రూమర్స్ వైరల్ చేస్తున్నారు. వాటన్నింటికి బ్రేక్ వేసేలా.. మేకర్స్ అదిరిపోయే సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. అదేంటో తెలియాలంటే ఇంకొన్ని గంటల పాటు వెయిట్ చేయక తప్పదు. (Bhagavanth Kesari Update)


Balayya.jpg

అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ (Shine Screens) బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు పొందిన బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, తమ్మి రాజు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘అఖండ’ తర్వాత మరోసారి బాలయ్య చిత్రానికి ఎస్. థమన్ (S Thaman) సంగీతం అందిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Vishal: అదోరకం సనాతన ధర్మం.. విశాల్‌ వ్యాఖ్యలకు నిర్మాత కౌంటర్‌

**********************************

*Tiger Nageswara Rao: టైగర్ కా హుకుమ్.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్సయింది

***********************************

*Skanda: అడుగడుగునా బోయపాటి మార్క్.. చూసుకుందాం.. బరాబర్ చూసుకుందాం

***************************************

*Hebah Patel: హెబ్బా నటించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ డైరెక్ట్‌గా ఓటీటీలోకే.. ఎప్పుడు, ఎక్కడంటే?

****************************************

Updated Date - 2023-09-27T18:49:13+05:30 IST