scorecardresearch

SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?

ABN , First Publish Date - 2023-07-22T12:16:11+05:30 IST

వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’ చిత్రానికి ‘కల్కి 2898 AD’ అని పేరుని ఖరారు చేస్తూ.. తాజాగా జరిగిన శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) ఈవెంట్‌లో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌పై దర్శకధీరుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. గ్లింప్స్ అద్భుతంగా ఉందని తెలుపుతూ.. రిలీజ్ డేట్ ఎప్పుడనేది తెలపాలని యూనిట్‌ని కోరారు.

SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?
Rajamouli about Kalki 2898 AD Glimpse

వైజయంతీ మూవీస్ (Vyjayanthi Movies) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’ (Project K) చిత్రానికి ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) అని పేరుని ఖరారు చేస్తూ.. తాజాగా జరిగిన శాన్ డియాగో కామిక్-కాన్ (SDCC) ఈవెంట్‌లో గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాటిక్ మాస్టర్ పీస్ సైన్స్ ఫిక్షన్, అపూర్వమైన స్టోరీ టెల్లింగ్ కలయికగా కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తోంది. పాత్రధారుల లుక్స్, సినిమా కాన్సెప్ట్, విజువల్స్‌తో ఈ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకర్షించింది. ‘కల్కి 2898 AD’ టైటిల్ చిత్ర సారాంశాన్ని సంపూర్ణంగా సంగ్రహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేమికుల్లో క్యురియాసిటీని కలగజేసింది. అయితే ఈ గ్లింప్స్‌పై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ఆసక్తికరంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ గ్లింప్స్‌పై రాజమౌళి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


‘‘గ్రేట్‌ జాబ్‌ నాగీ (నాగ్‌ అశ్విన్‌) మరియు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌. ఈ తరహా సినిమాలు తీయడం చాలా పెద్ద టాస్క్‌. అయినా మీరు సాధించగలిగారు. డార్లింగ్‌ ప్రభాస్ లుక్స్‌ అదిరిపోయాయ్. అన్నీ బాగున్నాయి.. ఇంకా నాకు ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది.. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు?’’ అంటూ రాజమౌళి తన ట్విట్టర్‌లో ఈ గ్లింప్స్ తనకి ఎంతగా నచ్చిందో తెలియజెప్పారు. అయితే ఆయన చివరిలో అడిగిన ప్రశ్ననే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా మేకర్స్‌ని అడుగుతున్నారు.

Kalki-1.jpg

ఇక రాజమౌళి రియాక్ట్ అయిన తీరుపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ (Shobu Yarlagadda) రియాక్ట్ అవుతూ.. ‘రిలీజ్ డేట్ ఎప్పుడు? అని ఎవరు అడుగుతున్నారో చూశారా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంటే, రాజమౌళి వంటి దర్శకుడే ఈ సినిమా కోసం ఎంత ఆతృతగా ఎదురుచూస్తున్నాడో అర్థం చేసుకోవచ్చనే భావనలో ఆయన ఇలా రిప్లయ్ ఇచ్చారు.

Kalki.jpg

అయితే.. కొందరు నెటిజన్లు మాత్రం.. జక్కన్న చెక్కుడుకి రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పడం కష్టం కదా.. అందుకే ఈ సినిమా కోసం ఎంత టైమ్ తీసుకుంటున్నారా? అనే క్యూరియాసిటీని రాజమౌళి వ్యక్తం చేశాడనేలా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా అయితే రాజమౌళి సంధించిన ఈ ప్రశ్నతో ఈ గ్లింప్స్ ఎలా ఉందో, సినిమా ఎలా ఉండబోతుందో అనేది ఓ క్లారిటీ వచ్చేసిందనేలా కూడా కొందరు రియాక్ట్ అవుతున్నారు. మరి రాజమౌళి ప్రశ్నకు ‘కల్కి 2898 AD’ మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..


Prabhas-1.jpg

ఇవి కూడా చదవండి:

**************************************

*Unstoppable: ఓటీటీలోకి వచ్చేసిన ‘అన్‌స్టాపబుల్’.. ఎందులో స్ట్రీమింగ్ అంటే..

**************************************

*Malavika Mohanan: జీవితం ఒక కళాకృతి కాదా?

**************************************

*Chiru-Allu Arjun: మామ, అల్లుడు.. ఎవ్వరూ తగ్గట్లే..!

**************************************

*VarunLavanya: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎప్పుడంటే..?

**************************************

*The Elephant Whisperers: బొమ్మన్‌ - బెల్లి దంపతులకు రాష్ట్రపతి అభినందన

**************************************

Updated Date - 2023-07-22T12:16:11+05:30 IST