Malavika Mohanan: జీవితం ఒక కళాకృతి కాదా?

ABN , First Publish Date - 2023-07-21T15:55:58+05:30 IST

సమాజంలో కళ అనేది కేవలం వస్తువులకు సంబంధించినదిగా మాత్రమే మిగిలిపోయిందని, జీవితం ఒక కళాకృతి కాదా? అని హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ ప్రశ్నిస్తోంది. ‘పేట’ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. త్వరలోనే ప్రభాస్ చిత్రంతో టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతోంది. కళపై తాజాగా ఆమె చేసిన పోస్ట్, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Malavika Mohanan: జీవితం ఒక కళాకృతి కాదా?
Malavika Mohanan

సమాజంలో కళ అనేది కేవలం వస్తువులకు సంబంధించినదిగా మాత్రమే మిగిలిపోయిందని, జీవితం ఒక కళాకృతి కాదా? అని హీరోయిన్‌ మాళవికా మోహనన్‌ (Malavika Mohanan) ప్రశ్నిస్తోంది. ‘పేట’ (Peta) చిత్రంతో కోలీవుడ్‌ (Kollywood)లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ‘మాస్టర్‌’, ‘మారన్‌’ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం చియాన్‌ విక్రమ్‌ నటిస్తున్న ‘తంగలాన్‌’ చిత్రంలో డీగ్లామర్‌గా కనిపించబోతోంది. సోషల్‌ మీడియాలో నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉండే మాళవిక మోహనన్.. అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫొటోలతో హిటెక్కిస్తుంటుంది. తాజాగా ఆమె వేదాంత ధోరణిలో కామెంట్స్‌ చేసింది.


పైగా తనలోని కళాత్మక నైపుణ్యాన్ని చూపించేందుకు వీలుగా సంప్రదాయ దుస్తులు, వాటికి మ్యాచ్‌ అయ్యేలా ఆభరణాలను ధరించింది. ఈ ఫొటోలను షేర్‌ చేసిన ఆమె... ‘మన సమాజంలో కళ అనేది జీవం లేని వస్తువులకు మాత్రమే పరిమితమైంది. వ్యక్తులు లేదా జీవితానికి సంబంధం లేనిదిగా మారిపోయింది. ఒక వస్తువును అద్భుతమైన కళాకృతిగా నిపుణులు లేదా కళాకారులు రూపొందిస్తారు. కానీ, ప్రతి ఒక్కరి జీవితం ఒక కళాకృతి కాదా?, మన జీవితాలు ఎందుకు అలా ఉండవు? అంటూ పోస్ట్ చేసింది. ఆమె షేర్ చేసిన ఈ ఫొటోలను చూసి.. నెటిజన్లు కూడా వావ్ అంటున్నారు. (Malavika Mohanan Post on Art)

Mohanan.jpg

‘ఒక్క క్షణం దీపికా పదుకొణె (Deepika Padukone) అనుకున్నాం.. మాళవిక అనుకోలేదు.. అలా ఉన్నారు ఈ ఫొటోలలో’ అంటూ నెటిజన్లు ఆమెను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. నిజంగానే ఈ ఫొటోలలో దీపికాను పోలి ఉంది మాళవిక. ఇక టాలీవుడ్‌లోనూ తన గ్లామర్ సత్తా చాటేందుకు మాళవిక సిద్ధమవుతోంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్‌‌లో (Prabhas and Maruthi Combo) తెరకెక్కుతోన్న చిత్రం ఆమె ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌లోనూ బిజీ హీరోయిన్‌గా మారతాననే ధీమాని మాళవిక వ్యక్తం చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Chiru-Allu Arjun: మామ, అల్లుడు.. ఎవ్వరూ తగ్గట్లే..!

**************************************

*VarunLavanya: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎప్పుడంటే..?

**************************************

*The Elephant Whisperers: బొమ్మన్‌ - బెల్లి దంపతులకు రాష్ట్రపతి అభినందన

**************************************

*Kalki 2898 AD Glimpse: వాట్ ఈజ్ ప్రాజెక్ట్ K.. సూపర్ హీరో వచ్చేశాడు.. గ్లింప్స్ ఎలా ఉందంటే..?

**************************************

*Upasana: ‘క్లీంకార’ పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్‌లు పెట్టొద్దు.. ఎందుకంటే?

**************************************

Updated Date - 2023-07-21T15:55:58+05:30 IST