VarunLavanya: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-07-21T12:27:57+05:30 IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ.. పెళ్లి వరకు చేరుకోబోతోంది. జూన్ 9న వీరిద్దరి నిశ్చితార్థం మెగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నిశ్చితార్థం వరకు గ్రాండ్‌గా నిర్వహించిన మెగా ఫ్యామిలీ మెంబర్స్.. పెళ్లి ఎప్పుడు? అనే విషయం మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. వారి వివాహం ఆగస్ట్ 24న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.

VarunLavanya: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎప్పుడంటే..?
Varun Tej and Lavanya Tripathi

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Meg Prince Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ల ప్రేమ.. పెళ్లి వరకు చేరుకోబోతోంది. జూన్ 9న వీరిద్దరి నిశ్చితార్థం (Engagement) మెగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నిశ్చితార్థం వరకు గ్రాండ్‌గా నిర్వహించిన మెగా ఫ్యామిలీ (Mega Family) మెంబర్స్.. పెళ్లి ఎప్పుడు? అనే విషయంపై మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. పెళ్లి ఎప్పుడు? అంటూ నెట్టింట్లో మెగా ఫ్యాన్స్ హడావుడి చేస్తూనే ఉన్నారు. నాగబాబు కూడా ఈ విషయంలో కామ్‌గానే ఉన్నారు. మరోవైపు నిహారిక విడాకుల విషయం మెగా ఫ్యామిలీనే కాకుండా.. మెగా ఫ్యాన్స్‌ని కూడా కాస్త డిస్టర్బ్ చేసింది.


ఈ విడాకుల మ్యాటర్ తప్పిదే.. మెగా ఫ్యామిలీ అంతా క్లీంకార (Klin Kaara) రూపంలో సంతోషంగానే ఉంది. ఇప్పుడా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ పెళ్లి రూపంలో మరింతగా ఆనందం నెలకొనబోతోంది. ఇప్పటి వరకు వరుణ్, లావణ్యల పెళ్లి తేదీ విషయమై క్లారిటీ రాకపోవడంతో.. ఎప్పుడెప్పుడు పెళ్లి అని అనుకునే వారందరికీ సమాధానం ఇచ్చేలా.. వారి పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం ఆగస్ట్ 24వ తేదీన డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఇటలీ (Italy)లో జరగబోతుందట. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీలతో పాటు దగ్గరి బంధువులు, ఇరువురి స్నేహితులు హాజరవుతారని తెలుస్తోంది. (Varun Tej and Lavanya Tripathi Marriage Date)

VarunLavanya.jpg

మరోవైపు వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘గాంఢీవధారి అర్జున’ (Gandheevadhari Arjuna) చిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా విడుదల తేదీని ప్రకటించారు. అంటే తన సినిమా విడుదల టైమ్‌కి వరుణ్ తేజ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటాడన్నమాట. ఈ లెక్కన ‘గాంఢీవధారి అర్జున’ ప్రమోషన్స్‌లో వరుణ్ తేజ్ పాల్గొనే అవకాశం అయితే లేనట్లే అని చెప్పొచ్చు. అయితే వరుణ్, లావణ్యల పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. కానీ ఆరోజే పెళ్లంటూ.. వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై మెగా ప్రిన్స్ (Mega Prince) ఎలా రియాక్ట్ అవుతాడో, ఎప్పుడు తన పెళ్లి తేదీని ప్రకటిస్తాడో చూడాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*The Elephant Whisperers: బొమ్మన్‌ - బెల్లి దంపతులకు రాష్ట్రపతి అభినందన

**************************************

*Kalki 2898 AD Glimpse: వాట్ ఈజ్ ప్రాజెక్ట్ K.. సూపర్ హీరో వచ్చేశాడు.. గ్లింప్స్ ఎలా ఉందంటే..?

**************************************

*Upasana: ‘క్లీంకార’ పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్‌లు పెట్టొద్దు.. ఎందుకంటే?

**************************************

*Hiranyakashyap: దేవుడనేవాడు ఉన్నాడు.. చూసుకుంటాడు.. రానాపై గుణశేఖర్ గుర్రు

**************************************

*Rules Ranjann: శ్రేయ ఘోషల్ వాయిస్‌లో ‘సమ్మోహనుడా’.. రొమాంటిక్ సాంగ్ ఎలా ఉందంటే..

**************************************

*Sitara Ghattamaneni: గుర్తు పెట్టుకోండి.. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది

**************************************

Updated Date - 2023-07-21T12:29:24+05:30 IST