Chiru-Allu Arjun: మామ, అల్లుడు.. ఎవ్వరూ తగ్గట్లే..!

ABN , First Publish Date - 2023-07-21T14:07:12+05:30 IST

మామ మెగాస్టార్ చిరంజీవి, అల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గట్లే. ఎందులో అనుకుంటున్నారా? లీక్స్‌లో. అవును మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య చిరు లీక్స్ అంటూ తన సినిమాలకు సంబంధించిన విశేషాలను ముందుగానే తెలియజేస్తున్నారు. ఇప్పుడాయన దారిలోనే ఆయన అల్లుడు అల్లు అర్జున్ కూడా ‘పుష్ప2’ సినిమా డైలాగ్‌లోని ‘బేబీ’ ఈవెంట్‌లో లీక్ చేశారు.

Chiru-Allu Arjun: మామ, అల్లుడు.. ఎవ్వరూ తగ్గట్లే..!
Allu Arjun and Chiranjeevi

మామ మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi), అల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun).. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గట్లే. ఎందులో అనుకుంటున్నారా? లీక్స్‌లో. అవును మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య చిరు లీక్స్ (Chiru Leaks) అంటూ తన సినిమాలకు సంబంధించిన విశేషాలను ముందుగానే తెలియజేస్తున్నారు. ఏదైనా వేడుకలో పాల్గొని స్పీచ్ ఇస్తున్నప్పుడు మెగాస్టార్‌కి తెలియకుండానే రహస్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలను రివీల్ చేస్తుంటారు. ఇదంతా ఎందుకులే అనుకుని.. ఆయనే స్వయంగా చిరు లీక్స్ అంటూ.. సోషల్ మీడియా వేదికగా ఈ మధ్య కొన్ని విషయాలను లీక్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)ని ఫస్ట్ టైమ్ ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమాలో ఇమిటేట్ చేసినట్లుగా ఓ సీన్ లీక్ చేశారు. ఇప్పుడు మామ దారిలోనే అల్లుడు కూడా నడుస్తున్నారు.


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ (Pushpa) సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇప్పుడు రాబోతోన్న ‘పుష్ప 2’ (Pushpa2) సినిమా కోసం అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ గురించి చెప్పేదేముంది. అప్‌డేట్ కోసం సోషల్ మీడియాలో దాదాపు యుద్ధ వాతావారణాన్నే క్రియేట్ చేస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ అందరి కోసం అల్లు అర్జున్ కూడా ఇప్పుడొక డైలాగ్‌ని లీక్ చేశారు. తాజాగా ఆయన ‘బేబీ’ సినిమా యూనిట్‌ని అభినందించేందుకు ఓ వేడుకను నిర్వహించారు. ఆ వేడుకలో ‘బేబీ’ (Baby) సినిమా గురించి గొప్పగా మాట్లాడిన అల్లు అర్జున్.. అభిమానుల కోసం తను చేస్తున్న ‘పుష్ప 2’ సినిమాలోని ఓ డైలాగ్‌ని చెప్పేశారు. (Pushpa 2 Dialogue)

Megastar-Icon-Star.jpg

‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి ఈ విధంగా అప్‌డేట్ ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు. ఇక్కడ చెబుతానని కూడా అనుకోలేదు.. ‘ఈడంతా జరిగేది ఒక్కటే రూల్ మీద జరుగుతుంటాది.. ఆ రూల్ పుష్ప గాడి రూల్’ అంటూ ‘పుష్ప2’ సినిమాలోని డైలాగ్‌ని అల్లు అర్జున్ (Allu Arjun) లీక్ చేసేశారు. అంతే.. ఇక మామ అల్లుళ్ళ లీక్స్ అంటూ సోషల్ మీడియాలో ఒకటే వార్తలు. చిరు లీక్స్‌కి పోటీగా అల్లు లీక్స్ (Allu Leaks).. మెగా ఫ్యాన్స్‌కి ట్రీటే ట్రీట్ అంటూ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

**************************************

*VarunLavanya: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఎప్పుడంటే..?

**************************************

*The Elephant Whisperers: బొమ్మన్‌ - బెల్లి దంపతులకు రాష్ట్రపతి అభినందన

**************************************

*Kalki 2898 AD Glimpse: వాట్ ఈజ్ ప్రాజెక్ట్ K.. సూపర్ హీరో వచ్చేశాడు.. గ్లింప్స్ ఎలా ఉందంటే..?

**************************************

*Upasana: ‘క్లీంకార’ పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్‌లు పెట్టొద్దు.. ఎందుకంటే?

**************************************

*Hiranyakashyap: దేవుడనేవాడు ఉన్నాడు.. చూసుకుంటాడు.. రానాపై గుణశేఖర్ గుర్రు

**************************************

*Rules Ranjann: శ్రేయ ఘోషల్ వాయిస్‌లో ‘సమ్మోహనుడా’.. రొమాంటిక్ సాంగ్ ఎలా ఉందంటే..

**************************************

Updated Date - 2023-07-21T14:42:11+05:30 IST