The Elephant Whisperers: బొమ్మన్‌ - బెల్లి దంపతులకు రాష్ట్రపతి అభినందన

ABN , First Publish Date - 2023-07-21T11:09:19+05:30 IST

‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ డాక్యుమెంటరీ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన తమిళ నాడు రాష్ట్రానికి చెందిన బొమ్మన్‌ - బెల్లి దంపతులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారిద్దరిని ఆహ్వానించి సన్మానించారు.

The Elephant Whisperers: బొమ్మన్‌ - బెల్లి దంపతులకు రాష్ట్రపతి అభినందన
Droupadi Murmu with Bomman and Bellie

‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ (The Elephant Whisperers) డాక్యుమెంటరీ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన తమిళ నాడు రాష్ట్రానికి చెందిన బొమ్మన్‌ - బెల్లి (Bomman and Bellie) దంపతులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వారిద్దరిని ఆహ్వానించి సన్మానించారు. తమిళనాడు (Tamil Nadu)లోని ముదుమలై అటవీ ప్రాంతానికి చెందిన ఈ దంపతులు ఏనుగులతో మమేకమై జీవనం సాగిస్తున్నారు. వీరి జీవిత చరిత్ర, గున్న ఏనుగు పెంపకం ఆధారంగా చేసుకుని ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ అనే పేరుతో డాక్యుమెంటరీ తెరకెక్కగా, దానికి ఆస్కార్‌ అవార్డు వరించింది. దీంతో ఈ దంపతులు ఒక్కసారిగా వార్తలలో నిలిచారు.


ఈ దంపతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో పాటు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) సైతం ప్రత్యేకంగా అభినందించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బొమ్మన్‌- బెల్లీ దంపతులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు ఆ దంపతులకు రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు. అలాగే, ప్రశంసాపత్రం ఇచ్చి అభినందించారు. ఈ సందర్భంగా ఆస్కార్‌ అవార్డును రాష్ట్రపతికి చూపించి వారు ముగ్ధులైపోయారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి ఎల్‌. మురుగన్‌ కూడా పాల్గొన్నారు.

Bomman-and-Bellie.jpg

‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ డాక్యుమెంటరీ విషయానికి వస్తే.. ఎలాంటి ప్రచారం, హంగూ ఆర్భాటాలు లేకుండా మనదేశం తరపున ఆస్కార్‌ బరిలో నిలిచిన ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ అకాడమీ అవార్డ్‌ (Academy Award)ను కైవసం చేసుకుంది. 95వ ఆస్కార్‌ పురస్కారాల్లో బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో మనదేశానికి దొక్కిన తొలి ఆస్కార్‌ పురస్కారం ఇదే.


ఇవి కూడా చదవండి:

**************************************

*Kalki 2898 AD Glimpse: వాట్ ఈజ్ ప్రాజెక్ట్ K.. సూపర్ హీరో వచ్చేశాడు.. గ్లింప్స్ ఎలా ఉందంటే..?

**************************************

*Upasana: ‘క్లీంకార’ పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగ్‌లు పెట్టొద్దు.. ఎందుకంటే?

**************************************

*Hiranyakashyap: దేవుడనేవాడు ఉన్నాడు.. చూసుకుంటాడు.. రానాపై గుణశేఖర్ గుర్రు

**************************************

*Rules Ranjann: శ్రేయ ఘోషల్ వాయిస్‌లో ‘సమ్మోహనుడా’.. రొమాంటిక్ సాంగ్ ఎలా ఉందంటే..

**************************************

*Sitara Ghattamaneni: గుర్తు పెట్టుకోండి.. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది

**************************************

*Leo: మైత్రీ మూవీ మేకర్స్ బాటలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫస్ట్ సినిమా ‘లియో’నే!

**************************************

Updated Date - 2023-07-21T11:09:19+05:30 IST