VJ Sunny: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి విజె సన్నీ.. కొత్త పార్టీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-06-27T18:44:58+05:30 IST

బిగ్‌బాస్ ఫేమ్ విజె సన్నీ కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడట. ఈ విషయం స్వయంగా ఆయన తన సోషల్ మీడియా వేదికలలో ప్రకటించారు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు నటుడిగా గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్న విజె సన్నీ, సడెన్‌గా రాజకీయాల్లోకి.. అందునా కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించడంతో.. ఇప్పుడంతా షాకవుతున్నారు.

VJ Sunny: బ్రేకింగ్.. రాజకీయాల్లోకి విజె సన్నీ.. కొత్త పార్టీ అనౌన్స్‌మెంట్ ఎప్పుడంటే?
VJ Sunny

బిగ్‌బాస్ ఫేమ్ విజె సన్నీ (VJ Sunny) కొత్త రాజకీయ పార్టీ (Political Party) పెట్టబోతున్నాడట. ఈ విషయం స్వయంగా ఆయన తన సోషల్ మీడియా వేదికలలో ప్రకటించారు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. ఇప్పుడు నటుడిగా గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్న విజె సన్నీ (VJ Sunny), సడెన్‌గా రాజకీయాల్లోకి.. అందునా కొత్త పార్టీ పెట్టబోతున్నట్లుగా ప్రకటించడంతో.. ఇప్పుడంతా షాకవుతున్నారు. నిజంగా రాజకీయాలలోకి రావాలంటే.. ఇప్పుడున్న ఏదో ఒక పార్టీలోకి వెళ్లవచ్చు. కానీ కొత్త పార్టీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంత మనీ అతని దగ్గర ఉందా? ఉంటే మాత్రం.. ఇప్పటికిప్పుడు పార్టీ పెట్టి ఏం చేద్దామని అనుకుంటున్నాడో? అంటూ కామెంట్స్ అయితే పడుతున్నాయి కానీ.. ఏదో ఒక మూల మాత్రం తేడా కొడుతూనే ఉంది.

‘‘నేను మీ అందరితో ఒక న్యూస్ షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని.. నేను కూడా నా సొంత పార్టీని స్టార్ట్ చేయబోతున్నాను. రేపు (బుధవారం) మధ్నాహ్నం 2 గంటలకు నా పార్టీ అనౌన్స్‌మెంట్ జరగబోతోంది. మీ అందరికీ మరింత దగ్గరవడానికి ఒక ప్రయత్నంగా ఒక పార్టీని లాంఛ్ చేయబోతున్నాను. రేపు మధ్నాహ్నం నా నూతన పార్టీ అనౌన్స్‌మెంట్.. మీ అందరి సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అంటూ విజె సన్నీ విడుదల చేసిన వీడియోలో చెప్పుకొచ్చారు. (VJ Sunny Party Announcement)

VJ-Sunny.jpg

అయితే ఇదంతా తను చేస్తున్న సినిమా, లేదంటే వెబ్ సిరీస్‌కు సంబంధించిన ప్రమోషన్ అనేలా కూడా కామెంట్స్ వినబడుతున్నాయి. అదీ కాకుండా తన నూతన చిత్రానికి సంబంధించిన ప్రకటన కూడా అయి ఉండవచ్చు. అంతేకానీ, ఇప్పటికిప్పుడు పార్టీ అంటూ ఈ యంగ్ హీరో చేస్తున్న హడావుడి మాత్రం నిజంగా పొలిటికల్ ఎంట్రీ కోసం కాదనేది.. ఆ వీడియోలో అతని అతి వినయం చూస్తుంటేనే అర్థమవుతోంది.. అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Venu Udugula: ఎవరొచ్చిరి ఏమిచ్చిరి.. ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి?


**************************************

*Rashmika Mandanna: నెటిజన్ షేర్ చేసిన వీడియో చూసి రష్మిక ఫుల్ ఖుష్.. అందులో ఏముందంటే?


**************************************

*NTR: ఎన్టీఆర్ ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ మూవీ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*KS Ramarao: ప్రేక్షకులు బాగుంది అని చెప్తే.. సినిమా సక్సెస్ అయినట్టే!


**************************************

*Varun Tej: మెగా ప్రిన్స్‌ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది


**************************************

* Prithviraj Sukumaran: షూటింగ్‌లో ప్రమాదం.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయాలు


**************************************

Updated Date - 2023-06-27T18:46:47+05:30 IST