Rashmika Mandanna: నెటిజన్ షేర్ చేసిన వీడియో చూసి రష్మిక ఫుల్ ఖుష్.. అందులో ఏముందంటే?

ABN , First Publish Date - 2023-06-26T23:38:03+05:30 IST

పాన్ ఇండియా వైడ్‌గా పేరున్న నటీమణులలో రష్మిక మందన్నా ఒకరు. ‘పుష్ప’ సినిమాతో పుష్పరాజ్ ఎలా అయితే ఫేమస్ అయ్యాడో.. శ్రీవల్లిగా రష్మిక మందన్నా కూడా అంతే పాపులారిటీని సొంతం చేసుకుంది. తాజాగా రష్మిక ఓ డ్యాన్స్ వీడియోని చూసి చాలా ఇంప్రెస్ అయింది. ఐ లవ్ దిస్ అంటూ.. ఆమె ఇచ్చిన రిప్లయ్‌తో ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Rashmika Mandanna: నెటిజన్ షేర్ చేసిన వీడియో చూసి రష్మిక ఫుల్ ఖుష్.. అందులో ఏముందంటే?
Rashmika Mandanna

పాన్ ఇండియా వైడ్‌గా పేరున్న నటీమణులలో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ‘పుష్ప’ (Pushpa) సినిమాతో పుష్పరాజ్ ఎలా అయితే ఫేమస్ అయ్యాడో.. శ్రీవల్లి (SriValli)గా రష్మిక మందన్నా కూడా అంతే పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత ఎక్కడికి వెళ్లినా రష్మిక మందన్నా.. ‘రారా సామి’ సాంగ్‌ స్టెప్ వేస్తూనే ఉంది.. అందరితో వేయిస్తూనే ఉంది. తాజాగా రష్మిక మందన్నా చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియోని చూసిన ఆమె.. యమా హ్యాపీగా ఉన్నాడంటూ రిప్లయ్ ఇచ్చింది. అంతేకాదు.. ‘ఐ లవ్ దిస్.. ’ (I Love This) అంటూ ఆమె రియాక్ట్ అయిన తీరు చూసి.. రష్మిక అభిమానులు కూడా యమా ఖుష్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

10 సంవత్సరాలు కూడా నిండని ఓ పిల్లాడు ‘వారిసు’ (Varisu) సినిమాలో రంజితమే పాట (Ranjithame)కు డ్యాన్స్ చేస్తూ.. స్టెప్స్ ఇరగదీస్తున్నాడు. ఆ వేడుకలో ఆ పిల్లాడు వేస్తున్న స్టెప్స్ అందరినీ ఆకర్షించడమే కాకుండా.. ఆ ఫంక్షన్‌కు అటెండ్ అయినవారితో కూడా స్టెప్స్ వేయించాయి. సేమ్ టు సేమ్ విజయ్ (Vijay) వేసినట్లే ఆ బుడతడు వేస్తున్న స్టెప్స్ నిజంగా చూడముచ్చటగా ఉన్నాయి. అందుకే రష్మికా అంతలా రియాక్ట్ అయింది. ‘ఐ లవ్ దిస్.. ఇలాంటి వీడియోలు నాకెంతో ఇష్టం. ఇలాంటి సాంగ్స్, డ్యాన్స్‌ని మీరు ఆస్వాదిస్తుంటే.. నాకెంతో సంతోషంగా ఉంది’ అని రష్మిక ఆ డ్యాన్స్ వీడియోపై స్పందించింది.

ఇప్పుడనే కాదు.. రీసెంట్‌గా ఓ పాప.. ‘వారిసు’ సినిమాలోని పాటను చూస్తూ భోజనం తింటుంది.. ఆ పాట చూడకపోతే భోజనం చేయదనేలా వచ్చిన వీడియోపై కూడా రష్మిక ఇలానే రియాక్ట్ అయింది. అంతకు ముందు ‘పుష్ప’ సినిమాలోని ‘రా రా సామి’ పాటకు స్కూల్ పిల్లలు వేసిన పాటపై కూడా ఆమె ఇలానే స్పందించి.. ఆ పాపని కలవాలని కోరింది. ఇలా తన పాటలకు ఎవరైనా పిల్లలు డ్యాన్స్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటే.. అవి చూసి రష్మిక మురిసిపోతుంది. రష్మిక స్పందనకు నెటిజన్లు కూడా వుయ్ ఆర్ ఇంప్రెసెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



ఇవి కూడా చదవండి:

**************************************

*NTR: ఎన్టీఆర్ ‘శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం’ మూవీ గురించి ఈ విషయాలు తెలుసా?

**************************************

*KS Ramarao: ప్రేక్షకులు బాగుంది అని చెప్తే.. సినిమా సక్సెస్ అయినట్టే!


**************************************

*Varun Tej: మెగా ప్రిన్స్‌ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాబోతోంది


**************************************

* Prithviraj Sukumaran: షూటింగ్‌లో ప్రమాదం.. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు గాయాలు


**************************************

Updated Date - 2023-06-26T23:38:03+05:30 IST