Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?

ABN , First Publish Date - 2023-07-12T21:40:17+05:30 IST

యంగ్ హీరో నితిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, టాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఇటీవల ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభం కాబోతోన్న ఈ చిత్రం నుంచి రష్మిక మందన్నా తప్పుకుంది. ప్రస్తుతం ఆమె ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా.. ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?
Rashmika Mandanna

యంగ్ హీరో నితిన్ (Nithiin), నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), టాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) సంస్థ ఇటీవల ఓ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘భీష్మ’ (Bheeshma) వంటి సక్సెస్ ఫిల్మ్ తర్వాత మరోసారి ఈ ముగ్గురు కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాకు #VNRTrio‌ అనే వర్కింగ్ టైటిల్‌ పెట్టి వర్క్ స్టార్ట్ చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సమయంలో.. సడెన్‌గా ఈ సినిమా నుంచి రష్మిక మందన్నా తప్పుకుంది. అందుకు కారణం లేకపోలేదు..


Rashmika-2.jpg

‘పుష్ప’ (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో నేమ్, ఫేమ్ సొంతం చేసుకున్న రష్మిక ఇప్పుడు నార్త్, సౌత్ సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ‘పుష్ప2’ (Pushpa 2) సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు.. ‘రెయిన్‌బో’ (Rainbow) అనే మరో ద్విభాషా చిత్రం, అలాగే రెండు హిందీ సినిమాలకు ఆమె సైన్ చేసి ఉండటంతో.. డేట్స్ అడ్జస్ట్ కాక.. నితిన్, వెంకీ కుడుమల సినిమా నుంచి ఆమె తప్పుకుంది. దీనికి సంబంధించి మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ టీమ్‌తో ఆమె సంప్రదింపులు జరిపిన తర్వాతే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Rashmika-1.jpg

సుకుమార్ (Sukumar), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఈ సినిమా నుంచి రష్మిక బయటికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే.. మొదటి పార్ట్ షూటింగ్ టైమ్‌లోనే ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించేశారు. అలాగే ఇప్పుడు ఆమెపైనే కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Rashmika-Mandanna.jpg

‘రెయిన్‌బో’ మూవీ కూడా సేమ్ టు సేమ్ పరిస్థితి. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. బాలీవుడ్‌లో సైన్ చేసిన చిత్రాలు కూడా ఇప్పుడు షూటింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. VNRTrio‌ ఇప్పటి వరకు ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తయింది. అందులో రష్మికకు సంబంధించి పెద్దగా షూటింగ్ జరగలేదని అందుకే.. ఇప్పుడే తప్పుకుంటే మంచిదని భావించి.. రష్మిక ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.


ఇవి కూడా చదవండి:

**************************************

*Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి

**************************************

*Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..

**************************************

*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..

**************************************

*Mahaveerudu: ‘మహావీరుడు’‌కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?

**************************************

Updated Date - 2023-07-12T21:54:19+05:30 IST