AR Rahman: నేను రామ్‍చరణ్ RC16కు పని చేస్తున్నా..

ABN , First Publish Date - 2023-07-12T23:25:45+05:30 IST

నేను రామ్‍చరణ్, బుచ్చిబాబు సానా సినిమాకు పని చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఇది చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్.. అని అన్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. తమిళంలో ఇటీవల విడుదలైన ‘మామన్నన్’ చిత్రం తెలుగులో ‘నాయకుడు’ పేరుతో జూలై 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో RC16పై రెహమాన్ క్లారిటీ ఇచ్చారు.

AR Rahman: నేను రామ్‍చరణ్ RC16కు పని చేస్తున్నా..
AR Rahman

నేను రామ్‍చరణ్ (Ram Charan), బుచ్చిబాబు సానా (Buchibabu Sana) సినిమాకు పని చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్ పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. ఇది చాలా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్.. అని అన్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman). ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) సంచలన దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అనే సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా అనంతరం రామ్ చరణ్.. ‘ఉప్పెన’ (Uppena) దర్శకుడు బుచ్చిబాబు సానాతో సినిమా (RC16) చేసేందుకు ఓకే చేశారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.


వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న RC16 సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సమర్పించనుంది. వెంకట సతీశ్ కిలారు నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ తర్వాత రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా హీరోయిన్, విలన్, మ్యూజిక్ డైరెక్టర్ పలానా అంటూ ఒకటే వార్తలు. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటించనుందంటూ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అలాగే ‘ఉప్పెన’లో విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతిని మరోసారి బుచ్చిబాబు విలన్‌గా సెలక్ట్ చేసినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో AR రెహమాన్ పేరు కూడా కొన్ని రోజులుగా సోషల్ మీడియా సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉంది. (AR Rahman about RC16)

Rahman.jpg

అయితే హీరో, విలన్ ఎవరనే వాటిపై క్లారిటీ రాలేదు కానీ.. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో స్వయంగా ఏఆర్ రెహమానే.. నేనే ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నానంటూ చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ‘నాయకుడు’ (Naayakudu) సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. తమిళంలో ఇటీవల విడుదలై సంచలనం సృష్టించిన ‘మామన్నన్’ చిత్రం తెలుగులో ‘నాయకుడు’ పేరుతో జూలై 14న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. RC16 సినిమాకు సంగీతం అందించబోతున్నట్లుగానూ, ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జైటెడ్‌గా ఎదురుచూస్తున్నట్లుగానూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*MS Dhoni: నా భార్య సినిమా అన్నప్పుడు.. నేను త‌న‌తో ఒకే మాట చెప్పా..

**************************************

*Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?

**************************************

*Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి

**************************************

*Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..

**************************************

*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..

**************************************

*Mahaveerudu: ‘మహావీరుడు’‌కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?

**************************************

Updated Date - 2023-07-12T23:25:45+05:30 IST