TNR Trailer: మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు

ABN , First Publish Date - 2023-10-03T18:47:37+05:30 IST

మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు.. తాజాగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్‌లోని డైలాగ్ ఇది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచి.. అంతా యాక్షన్ సినిమా అనే అనుకున్నారు కానీ.. ఈ ట్రైలర్ చూస్తుంటే అన్ని మసాలా దినుసులు దట్టించినట్లుగా అనిపిస్తోంది. రవితేజ నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రమిది. అక్టోబర్ 20న విడుదల కానుంది.

TNR Trailer: మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు
Tiger Nageswara Rao Movie Still

మగజాతి మొత్తం ఆడదాని కొలతలే చూస్తారు.. కాకపోతే బూతులు మాట్లాడతారు.. తాజాగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ట్రైలర్‌లోని డైలాగ్ ఇది. ఈ టైటిల్ అనౌన్స్ అయినప్పటి నుంచి.. ఈ సినిమా యాక్షన్ సినిమా అని అనుకున్నారు కానీ.. ఈ ట్రైలర్ చూస్తుంటే అన్ని మసాలా దినుసులు దట్టించినట్లుగా అనిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్‌లో, యంగ్ ట్యాలెంటెడ్ వంశీ (Vamsee) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal Arts) నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 20న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలకాబోతోంది. అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పాపులర్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా వార్తలలో ట్రెండ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ని తాజాగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. నాగేశ్వరరావు రాకతో రాబరీ పద్దతులు మారిపోతాయి. అతనికి అధికారం దాహం, స్త్రీలపై కాంక్ష, డబ్బు కోసం వ్యామోహం ఉంది. ఎవరినైనా కొట్టడానికి, ఏదైనా దోచుకోవడానికి ముందు హెచ్చరికలు చేయడం కూడా అతనికి అలవాటు. అయితే, నాగేశ్వరరావును ఎలిమినేట్ చేయడానికి ఒక బ్యాడ్ పోలీసు వస్తాడు. స్టూవర్టుపురం నాగేశ్వరరావు కథ అతని అరెస్టుతో ముగిసింది, అయితే టైగర్ నాగేశ్వరరావు కథ అక్కడి నుండి ప్రారంభమవుతుంది. నేషనల్ థ్రెట్‌గా మారిన టైగర్ నాగేశ్వరరావు నెత్తుటి వేట సాగుతుంది. (Tiger Nageswara Rao Trailer Talk)

రెండున్నర నిమిషాల ట్రైలర్‌లో నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. టైటిల్ రోల్‌లో రవితేజ యంగ్‌గా, డైనమిక్‌గా, వైల్డ్, బ్రూటల్‌గా కనిపించారు. మాసీ రోల్‌లో రవితేజ ట్రాన్స్‌ఫర్మేషన్ రచ్చ రచ్చే. రైల్వే స్టేషన్‌లను దోచుకోవడానికి పాట నిర్వహించే సీన్‌తో మొదలెట్టి.. ఈ ట్రైలర్‌తో దర్శకుడు కథ చెప్పిన తీరు సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ప్రతి సీన్ కోసం దర్శకుడు వంశీ పడిన తపన కనిపిస్తోంది. ‘కొట్టే ముందు కొట్టేసిన తర్వాత వార్నింగ్‌లు ఇవ్వడం నాకు అలవాటు’, ‘కొలతలు బాగున్నాయి.. మగజాతి మొత్తం కొలతలే చూస్తారు. కాకపోతే అనుభూతి, ఆరాధన అని అర్థంలేని బూతులు మాట్లాడతారు’ వంటి డైలాగ్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలు సినిమా కోసం వేచి చూసేలా చేస్తున్నాయి. అలాగే ఇందులో నటించిన ప్రతి నటుడికీ నటించడానికి ఒక స్పేస్, స్కోప్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఫీమేల్ లీడ్‌గా కనిపించగా.. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాజర్, జిషు సేన్‌గుప్తా, హరీష్ పెరడి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటించినట్లుగా ఈ ట్రైలర్‌తో తెలిసిపోతుంది. మొత్తంగా అయితే రవితేజ స్టార్ చరిష్మాకు తగినట్లుగా అద్భుతంగా ట్రైలర్‌ని ప్రజెంట్ చేశారు. (Tiger Nageswara Rao Trailer)


Ravi-Teja.jpg

టైగర్ నాగేశ్వరరావు యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. దర్శకుడు వంశీ కథ‌ని చూపించిన విధానం యునిక్‌గా వుంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడక్షన్ డిజైన్ టాప్ క్లాస్. యాక్షన్ కొరియోగ్రఫీ వరల్డ్ క్లాస్. ఆర్ మదీ తీసిన విజువల్స్ గ్రాండ్, టెర్రిఫిక్‌గా ఉన్నాయి. జివి ప్రకాష్ కుమార్ నేపధ్య సంగీతంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేశారు. ట్రైలర్ సినిమా‌పై అంచనాలని మరింత పెంచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి మయాంక్ సింఘానియా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. టైగర్ నాగేశ్వరరావు‌తో హిందీలోకి రావడం ఆనందంగా వుంది. హిందీకి నేనే డబ్బింగ్ చెప్పాను. టైగర్ నాగేశ్వరరావు తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుందని అన్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. రవితేజ గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. మాపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన రవితేజ‌గారికి ధన్యవాదాలు. దర్శకుడు వంశీ చాలా హార్డ్ వర్క్ చేశారు. అనుపమ్ ఖేర్ గారు మా ఫ్యామిలీ మెంబర్‌లానే వుంటారు. చాలా ప్యాషన్‌తో ఈ సినిమాని తీశాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని తెలిపారు. దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. రవితేజ‌గారు ఈ కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకూ ఎంతోగానో సపోర్ట్ చేశారు. ప్రతి అడుగులో నాకు అండగా నిలబడ్డారు. ఆయన ఫిల్మ్ లవర్. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆయన వలనే ఈ సినిమా సాధ్యపడింది. దాదాపు 500 పైగా చిత్రాలు చేసిన అనుపమ్ గారితో ఈ సినిమాలో పని చేయడం ఆనందంగా వుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో సపోర్ట్ చేశారు. అభిషేక్‌గారు చాలా గ్రాండ్‌గా ఈ సినిమా తీశారు. టైగర్ నాగేశ్వరరావు చాలా ప్రత్యేకమైన సినిమా. అందరినీ అలరిస్తుందని తెలిపారు. (Tiger Nageswara Rao Trailer Launch at Mumbai)


ఇవి కూడా చదవండి:

============================

*Siddharth: తెలుగులో సిద్ధార్థ్ సినిమాని ఎవరు చూస్తారని అన్నారట.. సిద్ధార్థ్ ఏడ్చేసినంత పనిచేశాడు

**********************************

*Hi Nanna: ‘హాయ్ నాన్న’ సెకండ్ సింగిల్ గాజు బొమ్మ విడుదల ఎప్పుడంటే..


***********************************

*Swayam Siddha: హీరోయిన్‌పై దర్శకహీరో ఫైర్.. కారణం ఏమిటంటే?

**************************************

*Yendira Ee Panchayithi Trailer: పైసాకైనా.. పడకకైనా.. ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే!

*************************************

*R Narayana Murthy: పేపరు లీకేజీలపై పీపుల్ స్టార్ ఎక్కుపెట్టిన అస్త్రం ఎప్పుడంటే..

**************************************

Updated Date - 2023-10-03T18:47:37+05:30 IST