Yendira Ee Panchayithi Trailer: పైసాకైనా.. పడకకైనా.. ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే!

ABN , First Publish Date - 2023-10-02T20:15:14+05:30 IST

భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’. ఈ మూవీతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. చాలా న్యాచురల్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లుగా తెలియజేస్తోంది.

Yendira Ee Panchayithi Trailer: పైసాకైనా.. పడకకైనా.. ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే!
Yendira Ee Panchayithi Movie Still

భరత్ (Bharath Bade), విషికా లక్ష్మణ్‌ (Vishika Laxman) జంటగా ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం (M. Pradeep Kumar) నిర్మించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’ (Yendira Ee Panchayithi). ఈ మూవీతో గంగాధర.టి (Gangadhara T) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విలేజ్ లవ్ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రం అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. ఇందులో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌ను కూడా చూపించబోతోన్నట్టుగా తాజాగా వదిలిన ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ట్రైలర్ విడుదల అనంతరం హీరో శ్రీకాంత్ (Hero Srikanth) మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది. కొత్త టీమ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించింది. సినిమా టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

ట్రైలర్ విషయానికి వస్తే.. ఈ మూవీలో డైలాగ్స్ హైలెట్స్‌గా ఉండబోతున్నాయనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ‘సాక్ష్యాలు ఉన్నవన్నీ నిజం కావు.. ఆధారాలు లేనివి అబద్దాలు కావు’ అంటూ పోలీస్ పాత్ర చెప్పే డైలాగ్‌తో ఇందులో క్రైమ్, సస్పెన్స్ అంశాలున్నాయని తెలుస్తుంటే.. ‘కొన్ని ప్రేమలు పెళ్లితో మొదలవుతాయి, కొన్ని పెళ్లికి ముందే ఆగిపోతాయి.. ఆగిపోయిన ప్రేమను వద్దనుకుంటే.. పెళ్లితో మొదలయ్యే ప్రేమను ఇవ్వాలనుకుంటున్నా’ అని ‌హీరోయిన్‌తో తండ్రి చెప్పే మాటల్లో ఓ ఎమోషనల్ లవ్ స్టోరీ ఉందనిపిస్తుంది. అలాగే ‘ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే.. అది పైసాకైనా, పడకకైనా’.. అంటూ హీరో ట్రైలర్ చివర్లో చెప్పిన డైలాగ్ చూస్తే.. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ అనేది కూడా తెలుస్తోంది. మొత్తంగా అయితే ఓ న్యాచురల్ లవ్ స్టోరీని అన్ని అంశాలతో కలిపి ఈ సినిమాని రూపొందించినట్లుగా అయితే ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. (Yendira Ee Panchayithi Trailer Talk)


Srikanth.jpg

ఈ ట్రైలర్‌లో విజువల్స్ కూడా సహజంగా ఉన్నాయి. పల్లెటూరి వాతావరణాన్ని, అందాలను చక్కగా చూపించారు కెమెరామెన్. ఆర్ఆర్, డైలాగ్స్ వేటికవే సాటి అనేలా ఉన్నాయి. కాగా.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోగా, ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా వారు చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

============================

*R Narayana Murthy: పేపరు లీకేజీలపై పీపుల్ స్టార్ ఎక్కుపెట్టిన అస్త్రం ఎప్పుడంటే..

**************************************

*Anasuya: మా ఆయన అప్పుడప్పుడు చేస్తారు.. నేను మాత్రం ప్రేమగా చేస్తా..!

**************************************

*Suruthi and Niranjana: లెస్బియన్లుగా శృతి - నిరంజన నటించిన చిత్రం ఓటీటీలో దున్నేస్తోంది

************************************

*L2 Empuraan: ‘లూసిఫర్ 2’కు లైకా కనెక్షన్.. ఈసారి మాములుగా ఉండదట!

************************************

Updated Date - 2023-10-02T21:24:40+05:30 IST