Swayam Siddha: హీరోయిన్‌పై దర్శకహీరో ఫైర్.. కారణం ఏమిటంటే?

ABN , First Publish Date - 2023-10-02T20:50:27+05:30 IST

‘ఎనక్కు ఎండే కిడైయాదు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భువనేశ్వర్‌ భామ స్వయం సిద్ధాపై ఆ చిత్ర హీరో మరియు దర్శకుడైన విక్రమ్‌ రమేష్‌ విమర్శలు గుప్పించారు. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు హీరోయిన్ డుమ్మా కొడుతున్నారని ఆరోపించారు.

Swayam Siddha: హీరోయిన్‌పై దర్శకహీరో ఫైర్.. కారణం ఏమిటంటే?
Heroine Swayam Siddha

‘ఎనక్కు ఎండే కిడైయాదు’ (Enaku Endey Kidaiyaathu) చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భువనేశ్వర్‌ భామ స్వయం సిద్ధా (Swayam Siddha)పై ఆ చిత్ర హీరో మరియు దర్శకుడైన విక్రమ్‌ రమేష్‌ (Vikram Ramesh) విమర్శలు గుప్పించారు. సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలకు హీరోయిన్ డుమ్మా కొడుతున్నారని ఆరోపించారు. కార్తీక్‌ వెంకట్రామన్‌ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా విక్రమ్‌ రమేష్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇటీవల ఈ చిత్ర ఆడియో, ట్రైలర్‌ వేడుకను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరోయిన్‌ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పబ్లిగ్గా హీరోయిన్‌పై విమర్శలు చేశారు.

swayam-Siddha.jpg

దర్శకుడు విక్రమ్‌ రమేష్‌ మాట్లాడుతూ.. కథా చర్చల సమయంలోనే హీరోయిన్‌కు అన్ని విషయాలు వివరించాం. అపుడు అన్నింటికీ అంగీకరించిన ఆమె.. ఇపుడు ప్రమోషన్‌కు దూరంగా ఉంటున్నారు. గట్టిగా అడిగితే ‘ఇండియన్‌-2’ (Indian 2), ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) షూటింగులతో బిజీగా ఉన్నట్టు చెబుతున్నారు. ఒక మంచి కథ, మంచి నిర్మాణ సంస్థ ఉంటే ఎవరితోనైనా సినిమా తీయవచ్చు. అదే పనిని తాము చేసి చూపించాం. ఇపుడు ప్రమోషన్‌ కార్యక్రమాలు జరిపి విడుదల చేయాల్సిన బాధ్యత అందులో నటించిన నటీనటులందరిపై ఉంది. కానీ, హీరోయిన్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని వాపోయారు. (Hero Vikram Ramesh Comments)


Vikram-Ramesh.jpg

అయితే దర్శకుడు విక్రమ్ రమేష్ వ్యాఖ్యలపై స్వయం సిద్ధా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇవే వ్యాఖ్యలు స్టార్ హీరోయిన్ల విషయంలో కూడా చేయగలరా? ముఖ్యంగా నయనతార వంటి వారు అసలు ప్రమోషన్స్‌కు రారు.. కానీ దర్శకనిర్మాతలు ఆమె గురించి ఎప్పుడూ ఇలా పబ్లిగ్గా చెప్పలేదు. అంటే.. ఇక్కడ స్టార్‌డమ్ ఉన్న వాళ్లని ఒకలా.. లేని వాళ్లని మరోలా చూస్తారా? ఆమె వేరే సినిమాల షూటింగ్స్ బిజీగా ఉన్నానని చెబుతున్నా.. ఇలా ఆమెను కించపరచడం కరెక్ట్ కాదంటూ దర్శకుడికి హితబోధ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Yendira Ee Panchayithi Trailer: పైసాకైనా.. పడకకైనా.. ఆడదాని ప్రేమ అవసరాలు తీరేంత వరకే!

*************************************

*R Narayana Murthy: పేపరు లీకేజీలపై పీపుల్ స్టార్ ఎక్కుపెట్టిన అస్త్రం ఎప్పుడంటే..

**************************************

*Anasuya: మా ఆయన అప్పుడప్పుడు చేస్తారు.. నేను మాత్రం ప్రేమగా చేస్తా..!

**************************************

*Suruthi and Niranjana: లెస్బియన్లుగా శృతి - నిరంజన నటించిన చిత్రం ఓటీటీలో దున్నేస్తోంది

************************************

*L2 Empuraan: ‘లూసిఫర్ 2’కు లైకా కనెక్షన్.. ఈసారి మాములుగా ఉండదట!

************************************

Updated Date - 2023-10-02T20:50:27+05:30 IST