Murali Raju: ప్రముఖ నిర్మాత తండ్రి కన్నుమూత

ABN , First Publish Date - 2023-03-07T14:28:02+05:30 IST

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మేనమామ అయిన నిర్మాత మురళీ రాజు (70) మంగళవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌ మధురానగర్‌లో

Murali Raju: ప్రముఖ నిర్మాత తండ్రి కన్నుమూత

బాలీవుడ్‌లో భారీ చిత్రాలను నిర్మించిన తెలుగు నిర్మాత మధు మంతెన (Madhu Mantena) తండ్రి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మేనమామ అయిన నిర్మాత మురళీ రాజు (70) మంగళవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌ మధురానగర్‌లో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం పట్టణానికి చెందిన మురళీ రాజు.. (Murali Raju) గతంలో సినీ నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. అలాగే సినీ నిర్మాణమే కాకుండా పలు వ్యాపారాలను కూడా ఆయన కొనసాగించారు. మురళీ రాజుకు ఇద్దరు సంతానం. అందులో ఒకరు మధు మంతెన కాగా, కూతురు అంబిక (Ambica). నిర్మాత మధు మంతెన అందరికీ పరిచయమే. తెలుగులో ‘గజని’, ‘రక్త చరిత్ర 1, 2’ చిత్రాలను నిర్మించిన మధు మంతెన బాలీవుడ్‌, ఇతర భాషలలో సుమారు 34కు పైగా చిత్రాలను నిర్మించారు.

మురళీ రాజు మృతి వార్త తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind), హీరో అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ క్రిష్ (Krish), గీతా ఆర్ట్స్ మేనేజర్ బన్నీ వాసు (Bunny Vas) తదితరులు మధురానగర్‌లోని మురళీ రాజు నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan).. మురళీ రాజు పార్దీవదేహాన్ని సందర్శించి.. నివాళులర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

*********************************

*NBK: ఏదైనా బాలయ్య దిగనంత వరకే.. వన్స్ హి స్టెప్ ఇన్..

*Poonam Kaur: మళ్లీ చెబుతున్నా అర్థం చేసుకోండి.. వేదికపైనే కంటతడి పెట్టిన పూనమ్ కౌర్..

*Allu Sneha Reddy: ‘క్యూటీ’ అంటూ అల్లు అర్జున్ పోస్ట్.. వైరల్ అవుతోన్న పిక్

*Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో నాది.. పెళ్లి తర్వాత మంచు మనోజ్ ఎవరి గురించి ఈ మాటన్నాడంటే..

*Amigos: ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు, ఎక్కడంటే?

* Waltair Veerayya: చిరంజీవి పేరు మీదే మరో రికార్డ్

* Veera Simha Reddy: 50 రోజులు.. ఎన్ని సెంటర్లలోనో తెలుసా?

* Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం

* Virupaksha Teaser: ప్ర‌మాదాన్ని దాట‌డానికే ఈ ప్రయాణం.. ఎక్కడో కనెక్ట్ అవుతున్నట్లుందే!

* Allu Arjun: ఇక్కడా తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ ఖాతాలో మరో రికార్డ్

* Poorna: ఏడో నెల గర్భిణీ.. ‘కానూర్’ తంతు వీడియో వైరల్

Updated Date - 2023-03-07T14:28:02+05:30 IST