కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Harish Shankar: ఆ కత్తులేంటి సామి.. భయపెట్టేస్తున్నావ్‌గా..!

ABN, First Publish Date - 2023-09-04T21:32:41+05:30

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మళ్లీ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. మంగళవారం (సెప్టెంబర్ 5) నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ మొదలవ్వబోతుందని తెలుపుతూ.. నిర్మాణ సంస్థ ఓ పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు.

Harish Shankar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రం మళ్లీ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. మంగళవారం (సెప్టెంబర్ 5) నుంచి ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ మొదలవ్వబోతుందని తెలుపుతూ.. నిర్మాణ సంస్థ ఓ పిక్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ చూసిన వారంతా భయపడిపోతున్నారు. ఎందుకని అనుకుంటున్నారా?


ఈ పిక్‌లో దర్శకుడు హరీష్ శంకర్ నిలబడి ఉండగా.. ఆయన ఎదురుగా రకరకాల కత్తులు దర్శనమిస్తున్నాయి. హరీష్ శంకర్ నిలబడిన తీరు, ఆయన ఎదురుగా ఉన్న కత్తులను చూసిన వారంతా.. అయ్యబాబోయ్ ఇన్ని రకాల కత్తులు వాడుతున్నారా? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే.. ఆ కత్తులేంటి సామి.. భయపెట్టేస్తున్నావ్‌గా..! మొత్తానికి ఏదో పెద్ద ప్లానే వేసినట్లున్నావ్.. అంటూ హరీష్ శంకర్ అండ్ టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అప్‌డేట్‌తో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందనే విషయం తెలిసి ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. మంగళవారం నుంచి మొదలయ్యే షెడ్యూల్‌లో ఓ మాసివ్ యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. (Ustaad Bhagat Singh Update)

ఇక ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని మేకర్స్ ఓ కొత్త పోస్టర్‌‌ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఖాకీ చొక్కా, గళ్ళ లుంగీ ధరించి, స్పోర్ట్స్ షేడ్స్‌తో పవన్ కళ్యాణ్ ఈ పోస్టర్‌లో కనిపించారు. ఈ పోస్టర్‌లో కూడా పవన్ కళ్యాణ్ చేతిలో కత్తిని గమనించవచ్చు. రక్తంతో తడిచిన కత్తిని పవన్ కళ్యాణ్ పట్టుకుని వుండగా, అతని వెనుక కొంత మంది వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఆ పోస్టర్ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ పోస్ట్ చేసిన పిక్ కూడా ట్రెండ్‌ బద్దల్ చేసేందుకు సిద్ధమవుతోంది. మేకర్స్ చేసిన ఈ పోస్ట్‌కు హరీష్ శంకర్ కూడా ‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ అంటూ రియాక్ట్ అయ్యారు. కాగా, మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Kushi: ‘ఖుషి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా.. సేఫ్ జోన్‌లోకి చేరుకున్నట్టే!

************************************

*Peddha Kapu-1: ‘పెదకాపు-1’ కూడా ఫిక్సయ్యాడు

*************************************

*Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గురించి ఈ విషయం తెలుసా..

*************************************

*Rules Ranjann: ‘సలార్’ డేట్‌కి ఫిక్సయిన ‘రూల్స్ రంజన్’.. క్లారిటీ కూడా ఇచ్చేశారు

************************************

Updated Date - 2023-09-04T21:32:41+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!