scorecardresearch

Kushi: ‘ఖుషి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా.. సేఫ్ జోన్‌లోకి చేరుకున్నట్టే!

ABN , First Publish Date - 2023-09-04T20:31:01+05:30 IST

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులను మెప్పిస్తూ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) 70.23 కోట్లను రాబట్టినట్లుగా మేకర్స్ ప్రకటించారు.

Kushi: ‘ఖుషి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా.. సేఫ్ జోన్‌లోకి చేరుకున్నట్టే!
Kushi Movie Poster

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా నటించిన ‘ఖుషి’ (Kushi) సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. ప్రేక్షకులను మెప్పిస్తూ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) 70.23 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా తెలుపుతూ.. ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కలెక్షన్లతో దాదాపు ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి చేరినట్లుగానే తెలుస్తోంది. (Kushi First Weekend Collections)


ఇక యుఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. యుఎస్‌లో ఇప్పటి వరకు 1.38 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్ అయినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే 2 మిలియన్ మార్క్‌ను అక్కడ ఈ సినిమా అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అసలైన పరీక్ష సోమవారం నుంచి మొదలుకాబోతోంది. అయితే సోమవారం కూడా ఈ సినిమాకు అన్ని ఏరియాస్‌లోనూ బుకింగ్స్ బాగానే జరిగినట్లుగా తెలుస్తోంది. ఇలాగే ఈ వీకెండ్ వరకు స్టడీగా నిలబడితే మాత్రం ‘ఖుషి’ బ్లాక్‌బస్టర్ ఖాతాలోకి చేరినట్టే. (Kushi Telugu Movie)

Kushi.jpg

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మొదటి నుంచి ఈ సినిమాపై మేకర్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకం నిజమైనందుకు, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తున్నందుకు.. దర్శకనిర్మాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుతున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Peddha Kapu-1: ‘పెదకాపు-1’ కూడా ఫిక్సయ్యాడు

*************************************

*Devil: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ గురించి ఈ విషయం తెలుసా..

*************************************

*Rules Ranjann: ‘సలార్’ డేట్‌కి ఫిక్సయిన ‘రూల్స్ రంజన్’.. క్లారిటీ కూడా ఇచ్చేశారు

************************************

*Alaya F: వారసత్వాన్ని నిలబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నా..

***********************************

Updated Date - 2023-09-04T20:31:01+05:30 IST