Prema Vimanam Trailer: వేసుకోవడానికి చెడ్డీ లేదు కానీ.. విమానంలో పోతారంట..

ABN , First Publish Date - 2023-10-06T16:54:17+05:30 IST

సంతోష్ క‌టా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన వెబ్ ఫిల్మ్ ‘ప్రేమ విమానం’. కళ్యాణ్ రామ్‌తో ‘డెవిల్’ చిత్రాన్ని నిర్మిస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ జీ 5తో కలిసి నిర్మిస్తోంది. అక్టోబ‌ర్ 13న జీ 5 ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ వెబ్ ఫిల్మ్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని చీర్స్ ఫౌండేషన్ వద్ద, 50 మంది అనాధ పిల్లలు, చిత్ర తారాగణం మరియు సిబ్బంది సమక్షములో విడుదల చేశారు.

Prema Vimanam Trailer: వేసుకోవడానికి చెడ్డీ లేదు కానీ.. విమానంలో పోతారంట..
Anasuya in Prema Vimanam

ఈ భూమి మీద మనిషిని ముందుకు నడిపించేవి ఎమోషన్స్. ఒక్కొక్క‌రి జీవితంలో ఒక్కో ఎమోష‌న్ ఉంటుంది. బ‌య‌ట నుంచి చూసే వారికి ఇదేంటని అనిపించినా.. వారికి మాత్రం ఆ ఎమోషనే ముఖ్య‌మ‌నిపిస్తుంది. అలాంటి ఎమోష‌న్స్ ఉన్న కొంద‌రి మ‌నుషుల జీవిత క‌థతో రూపొందుతోన్న వెబ్ ఫిల్మ్‌ ‘పేమ విమానం’ (Prema Vimanam). సంతోష్ క‌టా (Santosh Kata) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాని కళ్యాణ్ రామ్‌తో ‘డెవిల్’ చిత్రాన్ని నిర్మిస్తోన్న అభిషేక్ పిక్చర్స్ సంస్థ జీ 5 (Zee5)తో కలిసి నిర్మిస్తోంది. అక్టోబ‌ర్ 13న జీ 5 ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ వెబ్ ఫిల్మ్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని చీర్స్ ఫౌండేషన్ వద్ద, 50 మంది అనాధ పిల్లలు, చిత్ర తారాగణం మరియు సిబ్బంది సమక్షములో విడుదల చేశారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలను పెంచేదిగా ఎమోషనల్‌‌గా టచ్ చేస్తోంది.

Prema-Vimanam-2.jpg

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), శాన్వీ మేఘన (Saanvi Meghava) మ‌ధ్య ఉండే ప్రేమ అనే ఎమోష‌న్‌ను ద‌ర్శ‌కుడు ఆవిష్క‌రించారు. అమ్మాయేమో ధ‌న‌వంతుల పిల్ల‌.. కుర్రాడేమో పేదింటి కుర్రాడు. చాటు మాటుగా మాట్లాడుకోవ‌టం, క‌లుసుకోవ‌టం వంటి పనులు చేస్తుంటారు. అయితే త‌మ ప్రేమ‌ను బ‌తికించుకోవ‌టానికి పారిపోవాల‌నుకుంటారు. అప్పుడు వారేం చేశార‌నే క‌థ ఓ వైపు నడుస్తుంటే.. మ‌రో వైపు ఇద్ద‌రు చిన్న పిల్ల‌లకు విమానం ఎక్కాల‌నే కోరిక పుడుతుంది. వారిదేమో పేద కుటుంబం, ప‌ల్లెటూరు కావడంతో ఎలాగైనా ప‌ట్నం వెళ్లి విమానం ఎక్కాల‌నుకుంటారు. త‌మ ఊరి నుంచి పారిపోయి ప‌ట్నం వ‌చ్చేస్తారు. ఓ వైపు పిల్లలు, మ‌రో వైపు ప్రేమ జంట .. సిటీ వ‌చ్చిన త‌ర్వాత వారి జీవితాలు మ‌లుపు తిరిగే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. మ‌రి ఆ స‌మ‌స్య‌ల‌ను వారు అధిగ‌మించారా? వారి క‌ల‌ల‌ను నేర‌వేర్చుకున్నారా? అనే విష‌యం తెలియాలంటే అక్టోబ‌ర్ 13న జీ5 ఓటీటీలో రిలీజ్ కాబోయే ఈ ‘ప్రేమ విమానం’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేక‌ర్స్‌. వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు, సంతోషాలు, బాధలు, నవ్వులు ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని వారు చెబుతున్నారు. (Prema Vimanam Trailer Out)

Anasuya-1.jpg


సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించగా.. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా పని చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, అనసూయ (Anasuya Bharadwaj) వంటి వారు ఈ సినిమాలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇది తన మొదటి చిత్రమని, ఎప్పటికీ గుర్తుండి పోతుందని.. అలాగే అందరి మనసులను గెలుస్తుందని దర్శకుడు సంతోష్ కట్టా తెలిపారు.

Anu.jpg

నిర్మాత అభిషేక్ నామా (Abhishek Nama) మాట్లాడుతూ.. “ZEE5తో కలిసి ‘ప్రేమ విమానం’ చిత్రాన్ని నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకెంతో స్పెషల్. ఎందుకంటే మా ఇద్దరు అబ్బాయిలు (Devansh Nama, Anirudh Nama) ఇందులో కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాతో వారు పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఒక సినిమాటిక్ అనుభవం మాత్రమే కాదు. జీవితం పట్ల ప్రజల దృష్టికోణాన్ని మార్చే శక్తి ఉన్న హృద్యమైన కథతో ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించారు. ప్రతి ఒక్కరి మనసును దోచే కంటెంట్ ఇందులో ఉంది’’ అని తెలిపారు.

Prema-Vimanam.jpg


ఇవి కూడా చదవండి:

============================

*Unstoppable with NBK Season 3: మరో దరువుకి సిద్ధమైన బాలయ్య.. ఎప్పటి నుంచి అంటే..

**********************************

*Allu Arjun: ‘మేడమ్ టుస్సాడ్స్’లో మైనపు విగ్రహాం.. తొలి తెలుగు నటుడిగా రికార్డ్.. అదెలా?

********************************

*Gopichand32: గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ మొదలైంది.. భారీగానే ప్లాన్ చేశారు

*********************************

*Bhagavanth Kesari: వరుస అప్‌డేట్స్‌తో ఊపుమీదున్న బాలయ్య.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

*********************************

*NTRNEEL: ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..

**********************************

Updated Date - 2023-10-06T16:57:27+05:30 IST