Unstoppable with NBK Season 3: మరో దరువుకి సిద్ధమైన బాలయ్య.. ఎప్పటి నుంచి అంటే..

ABN , First Publish Date - 2023-10-05T21:57:09+05:30 IST

నందమూరి బాలకృష్ణ మోస్ట్ ఎవైటెడ్ షో అన్ స్టాపబుల్ సీజన్ 3 వచ్చేస్తోంది. బుల్లితెరపై తనదైన తరహాతో రెండు సీజన్లను కంప్లీట్ చేసి.. అద్భుతమైన ఆదరణను చూరగొన్న బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షో.. క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ సీజన్ 3కి సంబంధించి బాలయ్య సైన్ చేసినట్లుగా తెలుస్తోంది. దసరాకి ఫస్ట్ ఎపిసోడ్ కూడా టెలికాస్ట్ కానుందనేలా టాక్ వినబడుతోంది.

Unstoppable with NBK Season 3: మరో దరువుకి సిద్ధమైన బాలయ్య.. ఎప్పటి నుంచి అంటే..
NBK Unstoppable Season 3

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మోస్ట్ ఎవైటెడ్ షో ‘అన్ స్టాపబుల్ విత్ NBK సీజన్ 3’ (Unstoppable with NBK Season3) వచ్చేస్తోంది. బుల్లితెరపై తనదైన తరహాతో రెండు సీజన్లను కంప్లీట్ చేసి.. అద్భుతమైన ఆదరణను చూరగొన్న బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ షో.. క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు.. ఆహా ఓటీటీ (Aha OTT)లో ప్రసారమైన ఈ షో‌కి వచ్చిన స్పందన గురించి అందరికీ తెలిసిందే. సెలబ్రిటీలతో బాలయ్య ఆడిన గేమ్స్, వారి నుంచి రాబట్టిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం.. ఇప్పటికీ ఈ షో గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. అందుకే ఆహా యాజమాన్యం సీజన్ 3కి శ్రీకారం చుట్టారు. అన్ స్టాపబుల్ సీజన్ 3కి హోస్ట్‌గా చేసేందుకు అక్టోబర్ 5న బాలయ్య సైన్ చేసినట్లుగా తెలుస్తోంది.

దీంతో ఇప్పుడీ షో కి సంబంధించి #NBKUnstoppable3 ట్యాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అంతేకాదు, ఈ సీజన్ తొలి ఎపిసోడ్ ఎవరితో ఉంటుందనే దాని గురించి కూడా నెటిజన్ల కామెంట్స్ మొదలయ్యాయి. ఈ దసరాకి నటసింహం బాలకృష్ణ (Natasimham Balakrishna) నటించిన ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) విడుదల కాబోతోన్న నేపథ్యంలో.. ఈ చిత్రయూనిట్‌తో సీజన్ 3కి సంబంధించి ఓ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉందనేలా టాక్ నడుస్తోంది. (Unstoppable with NBK3)


Bala.jpg

అంతేకాదు.. ఈసారి బాలయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), తెలంగాణ మంత్రి కేటిఆర్ (Telangana Minister KTR) వంటి పాపులర్ వ్యక్తులను ఇంటర్యూ చేయబోతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తున్న నేపథ్యంలో.. ఈ సీజన్ 3 మరింత ఆసక్తికరంగా మారనుంది. లాస్ట్ సీజన్‌లో హీరోలతో పాటు పలువురు రాజకీయ నాయకులను బాలయ్య ఇంటర్యూ చేశారు. ఇప్పుడు రాబోతుంది ఎలక్షన్ సీజన్ కావటం, మరోవైపు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్ట్ కాబడి జైల్లో ఉండటంతో.. వీటిని రిలేట్ చేస్తూ బాలయ్య ఎవరినైనా ఇంటర్యూకి పిలవనున్నారా అనేది మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈ వార్తతో నందమూరి అభిమానుల్లో (Nandamuri Fans) మాత్రం జోష్ రెట్టింపవుతోంది.


ఇవి కూడా చదవండి:

============================

*Allu Arjun: ‘మేడమ్ టుస్సాడ్స్’లో మైనపు విగ్రహాం.. తొలి తెలుగు నటుడిగా రికార్డ్.. అదెలా?

********************************

*Gopichand32: గోపీచంద్, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ మొదలైంది.. భారీగానే ప్లాన్ చేశారు

*********************************

*Bhagavanth Kesari: వరుస అప్‌డేట్స్‌తో ఊపుమీదున్న బాలయ్య.. ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్!

*********************************

*NTRNEEL: ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ మూవీ మొదలయ్యేది ఎప్పుడంటే..

**********************************

*Kiran Abbavaram: బిగ్‌ బాస్ రతికతో పెళ్లి అనగానే.. కిరణ్ అబ్బవరం రియాక్షన్ చూశారా..

*********************************

Updated Date - 2023-10-05T21:57:09+05:30 IST