Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్

ABN , First Publish Date - 2023-05-01T21:20:02+05:30 IST

పేరున్న హీరోలెవరూ లేరు.. ఇందులో నటించిన చాలా మంది ఎవరికీ తెలియదు.. అయినా కూడా ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం..

Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్
Balagam Movie Poster

చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తూ.. కలెక్షన్ల వర్షం కురిపించిన, కురిపిస్తోన్న చిత్రం ‘బలగం’ (Balagam). ‘పిట్టకు పెట్టుడు’ అనే నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి (Telangana Culture)ని ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ చిత్రం.. పలు అవార్డులను కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఓటీటీలో సైతం ఈ సినిమా భారీగా ఆదరణను పొందుతుందంటే.. ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. పేరున్న హీరోలెవరూ లేరు.. ఇందులో నటించిన చాలా మంది ఎవరికీ తెలియదు.. అయినా కూడా ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం.. ఇందులోని పాత్రలు ప్రతి ఇంట్లో ఉండేవిగా.. మనుషుల బంధాలను, వారి మధ్య ప్రేమలను తెలిపేదిగా ఈ సినిమా తెరకెక్కడమే.

నిజంగా ఈ సినిమాని ‘జబర్ధస్త్’ (Jabardasth) కమెడియన్ తీశాడంటే ఇప్పటికీ ఎవరూ నమ్మడం లేదు. అంత గొప్పగా ఈ సినిమాని వేణు (Venu) తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపై కొందరు విమర్శలు చేసేటోళ్లు కూడా ఉన్నారు. ఇందులో లోపాలు ఉన్నాయని వెతికేటోళ్లు కూడా ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టేస్తే.. గ్రామాలకు గ్రామాలు ఇప్పుడీ సినిమాకు కనెక్ట్ అవుతున్నాయనే దానికి.. సోషల్ మీడియాలో దర్శనమిస్తోన్న కొన్ని ఫొటోలే సాక్ష్యం. అయితే ఈ సినిమా ఎంత గొప్పగా ఉన్నా.. తెలంగాణ గవర్నమెంట్ (Telangana Government) తలపెట్టిన కానిస్టేబుల్ పరీక్షలో (Constable Exam) ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్న ఇవ్వడం మాత్రం ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది.

Bala.jpg

మార్చి, 2023లో ఒనికో ఫిలిమ్స్ (ONYKO Films) అవార్డులలో ‘బలగం’ సినిమాకి ఏ విభాగంలో పురస్కారం (Award) లభించింది? అనే ప్రశ్నకు... 1. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగం, 2. ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగం, 3. ఉత్తమ నాటకం చలనచిత్ర విభాగం, 4. ఉత్తమ సంభాషణ చలనచిత్ర విభాగం.. అనే ఆప్షన్స్‌ను జోడించారు. ఈ ప్రశ్న అడిగినట్లుగా తెలుసుకున్న వేణు.. దీనిని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి.. తన ఆనందాన్ని తెలియజేశాడు. అయితే వేణు చేసిన ట్వీట్‌ చూసిన తర్వాత నెటిజన్లు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ సినిమా మాస్టర్ పీస్ వేణు. అంతా చూశాం.. మళ్లీ చూస్తాం. కానీ ఈ ప్రశ్నని కానిస్టేబుల్ పరీక్షలో అడగడం అనేది మాత్రం ఫూలిష్ యాక్ట్ (మూర్ఖత్వం). ఈ పరీక్షకు గానీ, కానిస్టేబుల్ చేసే ఉద్యోగానికి గానీ అక్కడ అడిగిన ప్రశ్నతో ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఎలా ఆలోచిస్తారు? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*PS2: కలెక్షన్ల ఊచకోత మొదలైంది..

*Dil Raju: మేరా దిల్ ఖుష్ హువా..

*Nidhhi Agerwal: ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న నిధి.. సంచలన నిర్ణయం

*Anushka: ‘మిస్ శెట్టి’.. ప్రభాస్‌ని భలే బుక్ చేసిందిగా.. ఇక నలుగురిలో తిరగగలడా?

*Bholaa Shankar: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. సోషల్ మీడియా షేక్

*Miss Shetty Mr Polishetty Teaser Talk: మీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?

*Director Teja: బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే!

Updated Date - 2023-05-01T21:20:02+05:30 IST