Anushka: ‘మిస్ శెట్టి’.. ప్రభాస్‌ని భలే బుక్ చేసిందిగా.. ఇక నలుగురిలో తిరగగలడా?

ABN , First Publish Date - 2023-05-01T15:22:14+05:30 IST

ప్రభాస్, అనుష్కల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రమే కావడం విశేషం. ప్రభాస్ నిక్ నేమ్‌ని..

Anushka: ‘మిస్ శెట్టి’.. ప్రభాస్‌ని భలే బుక్ చేసిందిగా.. ఇక నలుగురిలో తిరగగలడా?
Prabhas and Anushka

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), స్వీటీ అనుష్క (Anushka)పై ఈ మధ్య కాస్త వార్తలు తగ్గాయనే చెప్పుకోవాలి. అంతకు ముందు వీరిద్దరి విషయంలో వార్తలు ఏ విధంగా వైరల్ అయ్యాయో తెలియంది కాదు. మరీ ముఖ్యంగా వీరిద్దరికి పెళ్లి అంటూ ఎప్పటికప్పుడు వార్తలు రావడం, ఆ వార్తలని ఇద్దరూ ఖండించడం.. ఇలా ఎప్పుడూ ఈ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండేవి. కానీ ఈ మధ్య అనుష్క ఓ పారిశ్రామిక వేత్తని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ప్రభాస్ పేరు అనుష్క విషయంలో వినబడటం తగ్గింది. అయితే ఇప్పుడు మళ్లీ వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mister Polishetty) చిత్రమే కావడం విశేషం.

అదెలా అంటే.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్రభాస్‌కి చెందిన యూవీ క్రియేషన్స్ (UV Creations) సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్‌ని ప్రభాస్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసి.. యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. అంత వరకు బాగానే ఉంది కానీ.. ప్రభాస్ ఇన్‌స్టా‌లో చేసిన ఈ పోస్ట్‌కు అనుష్క ఇచ్చిన రిప్లయ్ ఉంది చూశారూ.. అదే ఇప్పుడు ప్రభాస్‌ని నలుగురిలో తిరగనీయలేనంత పని చేసింది. ఇంతకీ అనుష్క ఏమని రిప్లయ్ ఇచ్చిందంటే.. ‘థ్యాంక్యూ పప్సు’ (Thank You Pupsuuu) అంటూ అనుష్క తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ప్రభాస్ నిక్ నేమ్ ఇదా అంటూ అందరూ ‘పప్సు’ అనే పేరును ట్రెండ్ చేస్తున్నారు.

Anushka.jpg

వాస్తవానికి ఇది ప్రభాస్ నిక్ నేమ్ అయి ఉండదు. వీరిద్దరూ మంచి స్నేహితులు (Friends). ప్రభాస్‌ని కేవలం అనుష్క అలా పిలుస్తుందేమో.. సోషల్ మీడియాలో కూడా అలాగే పిలుస్తూ థ్యాంక్స్ చెప్పేసింది. అయితే ప్రభాస్ కటౌట్‌కి, ఆ పేరుకి ఏమైనా సంబంధం ఉందా? అని ఫ్యాన్స్ ఫీలవుతుంటే.. యాంటీ ఫ్యాన్స్ అయితే ర్యాగింగ్‌కు దిగేశారు. మొత్తంగా.. ప్రభాస్ స్పందనపై అనుష్క ప్రతిస్పందన సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి యుద్ధాన్నే తలపిస్తుంది. ఇక ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ విషయానికి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటించిన చిత్రమిది. టీజర్ ప్రామిసింగ్ ఉండటంతో పాటు.. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనేది ఈ టీజర్ చెప్పేస్తోంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్కను ఈ టీజర్‌ను చూసిన ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ టీజర్‌ ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Bholaa Shankar: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. సోషల్ మీడియా షేక్

*Miss Shetty Mr Polishetty Teaser Talk: మీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?

*Director Teja: బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే!

*Nani 30: ‘నాని 30’లో చిరు, బాలయ్య సినిమాల్లో చేసిన హీరోయిన్

Updated Date - 2023-05-01T15:22:14+05:30 IST