Dil Raju: మేరా దిల్ ఖుష్ హువా..

ABN , First Publish Date - 2023-05-01T20:08:42+05:30 IST

మంచి సినిమాని ఎంపిక చేసుకొని కష్టపడితేనే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ అవ్వడానికి అవకాశాలు వున్నాయి. అవకాశం వుంది కాబట్టి కష్టపడాలి. కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి..

Dil Raju: మేరా దిల్ ఖుష్ హువా..
Dil Raju at Selfish Song Launch

తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి (Reddy), నూతన దర్శకుడు విశాల్ కాశీ(Vishal Kasi) దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ (Sukumar Writings), ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju), శిరీష్‌ (Shirish)ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సెల్ఫిష్’ (Selfish). ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్లలో ఆశిష్ మాస్ క్యారెక్టర్, నిర్లక్ష్య వైఖరిని ఇప్పటికే రివీల్ చేశారు. తాజాగా మేకర్స్ చిత్ర ఫస్ట్ సింగిల్‌ ‘దిల్ ఖుష్’‌ (Dil Kush)ను విడుదల చేశారు. ఇది హీరో పాత్ర తాలుకు.. మరొక కోణం చూపుతుంది. ఇది సెల్ఫిష్ దిల్ కా ఫస్ట్ బీట్. దిల్ ఖుష్ పాటలో కథానాయిక పాత్ర పోషించిన ఇవానాని ఆరాధించే కథానాయకుడి ఆనందాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఈ పాటను తెలుగు, హిందీ పదాల అందమైన అల్లికతో సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాశారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జె మేయర్ లైవ్లీ బీట్‌ లతో చక్కని మెలోడీని స్కోర్ చేశాడు. జావేద్ అలీ పాటను పాడారు. ఈ పాట చార్ట్‌ బస్టర్‌‌గా మారడానికి అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. అలాగే ఆశిష్ తన డ్యాన్స్ స్కిల్స్‌ని ఇందులో ప్రదర్శించాడు. ఎనర్జిటిక్‌‌గా కనిపించే యంగ్ చాప్ ఎలిగెంట్ మూవ్స్‌తో ఆకట్టుకున్నాడు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మే 1 హీరో ఆశిష్ పుట్టిన సందర్భంగా మీడియా సమక్షంలో ఈ పాటను విడుదల చేశారు. పాట విడుదల అనంతరం..

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ (Dil Raju Speech).. ‘‘ఆశిష్ పుట్టిన రోజు మీడియా మిత్రుల ద్వారా ఈ పాటని విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. సుకుమార్ నేను మళ్ళీ 19 ఏళ్ల తర్వాత క్రియేటివ్ వర్క్ చేస్తున్నాం. ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) జరుగుతున్నపుడు ఈ సినిమా ఐడియా విన్నాను. వినగానే ఆసక్తికరంగా అనిపించింది. ‘రౌడీ బాయ్స్’ ఒక కొత్త కుర్రాడికి రావల్సినంత రెవెన్యూ తెచ్చుకొని, ప్రశంసలు కూడా అందుకుంది. ఆశిష్‌కు మంచి మార్కులు పడ్డాయి. సెల్ఫిష్ కథ విన్నప్పుడు ఆశిష్‌కు బావుంటుందనిపించింది. మిక్కీ మాంచి ట్యూన్ ఇచ్చారు. ఈ పాట లిరిక్స్ విషయంలో మొదటి నుంచి చాలా పట్టుదలగా వున్నాను. లిరిక్స్ ఇంత బాగా రావడానికి కారణం రామజోగయ్య శాస్త్రిగారు. మిక్కీతో మాది అద్భుతమైన జర్నీ. అందరూ కష్టపడి మంచి సాంగ్ ఇచ్చారు. మేరా దిల్ ఖుష్ హువా.. నా ‘దిల్’ రైట్స్ (Dil Rights) ఈ పాటకు తీసుకున్నారు (నవ్వుతూ).

Raju.jpg

ఓల్డ్ సిటీ నేపధ్యంలోజరిగే ఈ కథలో హిందీ లిరిక్స్ కూడా అవసరమయ్యాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని హిందీ పదాలు కూడా వాడాం. ఇది ధూల్ పేట్ నేపధ్యంలోకి వచ్చిన తర్వాత ఓ కొత్త ప్రయోగం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇందులో ఇదొక్క పాటే మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ మరో రెండు పాటలు చేశారు. మరో రెండు పాటలు వేరే సంగీత దర్శకులు చేస్తారు. సినిమాకి సరిపోయేలా కొత్తగా చేయాలని ప్రయత్నిస్తున్నాం. దర్శకుడు కాశీ విశాల్‌ని ఖచ్చితంగా కష్టపెడతాను( నవ్వుతూ). ప్రేక్షకులకు విజయవంతమైన సినిమా ఇవ్వడం అంత తేలికకాదు. ‘దసరా, విరూపాక్ష, బలగం’.. ఇలా కొత్తదనంతో కొత్త దర్శకులు తీసిన చిత్రాలన్ని ప్రేక్షకులని మెప్పిస్తున్నాయి. కొత్తదనం లేకపోతే చూడటానికి ప్రేక్షకులు రెడీగా లేరు. అది ఇవ్వడానికి రాత్రిపగలు కష్టపడాల్సిందే. మాంచి టీమ్‌తో చేస్తున్న చిత్రమిది. సినిమాని నేచురల్‌గా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. నేను గానీ, సుకుమార్‌గారు గానీ వెనుక మాత్రమే వుంటాం. ప్రేక్షకులకు నచ్చాల్సింది మాత్రం ఆశిష్. దాని కోసం తను రాత్రిపగలు కష్టపడితేనే ప్రేక్షకులకు రీచ్ అవుతారు. మంచి సినిమాని ఎంపిక చేసుకొని కష్టపడితేనే ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ అవ్వడానికి అవకాశాలు వున్నాయి. అవకాశం వుంది కాబట్టి కష్టపడాలి. కష్టపడితే ఆ కష్టాన్ని గుర్తించి ఏదో ఒక రోజు ఒక మంచి సినిమాతో ప్రేక్షకులు తమ హృదయాల్లోకి తీసుకుంటారు (Selfish Song Launch Event)’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Nidhhi Agerwal: ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్న నిధి.. సంచలన నిర్ణయం

*Anushka: ‘మిస్ శెట్టి’.. ప్రభాస్‌ని భలే బుక్ చేసిందిగా.. ఇక నలుగురిలో తిరగగలడా?

*Bholaa Shankar: వింటేజ్ లుక్‌లో మెగాస్టార్.. సోషల్ మీడియా షేక్

*Miss Shetty Mr Polishetty Teaser Talk: మీ టైమింగ్ ఎప్పుడూ ఇంతేనా?

*Director Teja: బాలీవుడ్ సినిమాని చంపింది.. టాలీవుడ్ సినిమాని చంపబోతోందీ అదే!

Updated Date - 2023-05-01T20:08:42+05:30 IST