Brahmanandam: ఇదిగో సీఏం గారూ.. మా అబ్బాయి పెళ్లికి తప్పకుండా రావాలి

ABN , First Publish Date - 2023-07-29T19:31:19+05:30 IST

హాస్యనటుడు బ్రహ్మానందం రెండవ కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం కరీంనగర్‌కు చెందిన డాక్టర్ పద్మజ, వినయ్‌ల పుత్రిక అయిన డాక్టర్ ఐశ్వర్యతో ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. త్వరలో జరగబోతున్న సిద్ధార్థ్, ఐశ్వర్యల వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కుటుంబ సమేతంగా ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ.. బ్రహ్మానందం ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలిపారు.

Brahmanandam: ఇదిగో సీఏం గారూ.. మా అబ్బాయి పెళ్లికి తప్పకుండా రావాలి
Brahmanandam Invites KCR For His Son Marriage

హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) రెండవ కుమారుడు సిద్ధార్థ్ (Siddharth) నిశ్చితార్థం కరీంనగర్‌కు చెందిన డాక్టర్ పద్మజ, వినయ్‌ల పుత్రిక అయిన డాక్టర్ ఐశ్వర్య (Aishwarya)తో ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈ నిశ్చితార్థం అనంతరం జరగబోయే పెళ్లి కార్యక్రమానికి బ్రహ్మానందం అతిథులను ఆహ్వానిస్తూ బిజీగా ఉన్నారు. శనివారం ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangan CM KCR)ని కుటుంబ సమేతంగా కలిసి.. తన కుమారుడి పెళ్లి వేడుకకు హాజరు కావాలని బ్రహ్మానందం వివాహ ఆహ్వాన పత్రికను (Wedding Invitation) అందజేశారు. ఆహ్వానానికి సంతోషం వ్యక్తం చేస్తూ.. బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు.


బ్రహ్మానందం చిన్న కుమారుడు విషయానికి వస్తే.. బ్రహ్మీ పెద్ద కుమారుడు రాజా గౌతమ్ (Raja Goutham Kanneganti) అందరికీ పరిచయమే.. ఆయన హీరోగా కొన్ని సినిమాలలో నటించారు. కానీ చిన్న కుమారుడు అంత పెద్దగా పబ్లిక్‌లో ఫోకస్ కాలేదు. చాలా మందికి ఆయనకు రెండో కొడుకు ఉన్న విషయం కూడా తెలియదు. ఈ నిశ్చితార్థంతోనే ఆయన పేరు పబ్లిక్‌కి తెలిసింది. సిద్ధార్థ్ విదేశాల్లో చదువుకుని.. అక్కడే స్థిరపడినట్లుగా సమాచారం. ఇటీవల వచ్చిన నిశ్చితార్థపు ఫొటోలు వైరల్ కాగా.. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తోంది. అయితే పెళ్లి ఎప్పుడనే (తేదీ) విషయం తెలియరాలేదు. బ్రహ్మానందంకు కాబోయే రెండో కోడలు ఐశ్వర్య కరీంనగర్‌లోని ప్రముఖ గైనకాలజిస్ట్‌ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం యజమాని డాక్టర్‌ పద్మజ–వినయ్‌ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె అని తెలుస్తోంది. ఐశ్వర్య కూడా తన మదర్‌లానే గైనకాలజీ, ఫర్టిలిటీలో స్పెషలైజేషన్‌ చేసినట్లు సమాచారం.

KCR.jpg

బ్రహ్మానందం విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన చిన్న చిన్న రోల్స్‌లో కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘బ్రో’ (Bro) సినిమాలో ఓ మెరుపులాంటి పాత్రలో కనిపించారు. రాబోయే ‘భోళా శంకర్’ (Bholaa Shankar)లో కూడా బ్రహ్మీ తన మ్యాజిక్ చేయబోతున్నట్లుగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. వీటితో పాటు తన దగ్గరకు వచ్చిన పాత్రలలో మంచి పాత్రలను ఎన్నుకుని తన హాస్యాన్ని తెరపై పండిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Sandeham: హెబ్బా పటేల్ ‘సందేహం’లో ‘చచ్చినా చావని ప్రేమిది’


**************************************

*Allu Aravind: డైరెక్టర్ మారుతి కుమార్తె టాలెంట్‌కి అల్లు అరవింద్ ఫిదా

**************************************

*Kushi Title Song: విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ అదిరింది

**************************************

*Ajith Kumar: తమన్నా కోసం ట్రై చేయండి

*************************************

Updated Date - 2023-07-29T22:30:45+05:30 IST