Sandeham: హెబ్బా పటేల్ ‘సందేహం’లో ‘చచ్చినా చావని ప్రేమిది’

ABN , First Publish Date - 2023-07-29T18:39:11+05:30 IST

విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్‌పై హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సందేహం’. ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘చచ్చినా చావని ప్రేమిది’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్.. డైరెక్టర్ దశరథ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

Sandeham: హెబ్బా పటేల్ ‘సందేహం’లో ‘చచ్చినా చావని ప్రేమిది’
Hebha Patel In Sandeham Movie

విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్‌పై హెబ్బా పటేల్ (Hebha Patel) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సందేహం’ (Sandeham Movie). ‘షి బిలీవ్డ్’ అనేది ట్యాగ్ లైన్. సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ఊరికి ఉత్తరాన’ సినిమా ఫేమ్ సతీష్ పరమవేద (Sateesh Paramveda) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ వూటుకూరు హీరోగా నటిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. ఈ సినిమా నుంచి మేక‌ర్స్ ‘చచ్చినా చావని ప్రేమిది’ (Chachhinaa Chaavani Premidi Song) అనే లిరిక‌ల్ సాంగ్‌ను.. ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ (Dasaradh) చేతుల మీదుగా విడుదల చేశారు.


పాట విడుదల చేసిన అనంతరం డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ... డైరెక్టర్ సతీష్ పరమదేవగారితో చాలా కాలంగా నాకు మంచి అనుబంధం ఉంది. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ‘సందేహం’ మూవీ లిరిక‌ల్ సాంగ్‌ను విడుద‌ల చేయ‌టం చాలా హ్యాపీగా ఉంది. పూర్ణాచారిగారు పాట‌ను అద్భుతంగా రాశారు. పాట వింటుంటే చాలా క్యాచీగా ఉంది. నిర్మాత స‌త్య‌నారాయ‌ణ‌గారు, హీరో సుమ‌న్‌, హెబ్బా ప‌టేల్ ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు తెలియజేస్తున్నానని అన్నారు. (Sandeham)

Dasarath.jpg

మ‌న చౌదరి మాట్లాడుతూ... ‘సందేహం’ సినిమా నుంచి రిలీజైన ‘చచ్చినా చావని ప్రేమిది’ పాట చాలా బావుంది. ఈ సినిమా ఓపెనింగ్ జరిగినప్పటి నుంచి నాకు తెలుసు. ఎంటైర్ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డి అనుకున్న స‌మ‌యంలో సినిమాను పూర్తి చేశారు. సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సినిమాలో గతంలో ఎప్పుడూ చూడని డిఫరెంట్ పాత్రలో హెబ్బా పటేల్‌ని చూస్తారని చిత్రయూనిట్ పేర్కొంది.


ఇవి కూడా చదవండి:

**************************************

*Allu Aravind: డైరెక్టర్ మారుతి కుమార్తె టాలెంట్‌కి అల్లు అరవింద్ ఫిదా

**************************************

*Kushi Title Song: విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ అదిరింది

**************************************

*Ajith Kumar: తమన్నా కోసం ట్రై చేయండి

*************************************

* Sai Dharam Tej: అభిమానులకు విన్నపం.. నాకిప్పుడు అంత ధైర్యం లేదు

*************************************

*Ileana: రెండు నెలలలోనే ఇంత మార్పా.. ఇలియానా ఇప్పుడెలా ఉందో చూశారా?

**************************************

Updated Date - 2023-07-29T22:35:49+05:30 IST