సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Natural Star Nani: ‘దసరా’పై సూపర్ స్టార్ ట్వీట్.. నాని అలా అనేశాడేంటి?

ABN, First Publish Date - 2023-04-01T10:59:19+05:30

దసరా సినిమాను చూసిన వారంతా.. సోషల్ మీడియా (Social Media) వేదికగా చిత్ర టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఈ సినిమాని ప్రశంసిస్తూ

Super Star Mahesh Babu and Natural Star Nani
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాచురల్ స్టార్ నాని (Natural Star Nani) హీరోగా శ్రీకాంత్ ఒదెల (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కిన మాసియస్ట్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ చిత్రం ‘దసరా’ (Dasara). శ్రీరామనవమి స్పెషల్‌గా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు.. నాని కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్స్‌ని రాబట్టింది. పాన్ ఇండియా వైజ్‌గా పాజిటివ్ టాక్ రావడంతో పాటు.. సినిమాలో నాని నటన కూడా అద్భుతంగా ఉందనే కామెంట్లు వినిపిస్తుండటంతో.. ‘దసరా’ కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. అలాగే మరో సినిమా పోటీ లేకపోవడం కూడా ఈ సినిమాకు మరింతగా ప్లస్ అయింది. ఇక ఈ సినిమా చూసిన వారంతా.. సోషల్ మీడియా (Social Media) వేదికగా చిత్ర టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) ఈ సినిమాని ప్రశంసిస్తూ ట్విట్టర్ వేదిక ఓ ట్వీట్ వేశారు. ఈ ట్వీట్‌కు నాని ఇచ్చిన రిప్లయ్.. మరోసారి చర్చలకు తావిస్తోంది.

మరోసారి ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్స్‌లో నాని మాట్లాడిన మాటలపై అనేక రకాలుగా చర్చలు నడిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) ట్వీట్‌కు నాని ఇచ్చిన ప్రతిస్పందన కూడా అలాంటి చర్చలకే తావిస్తోంది. సినిమా చూసిన మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా.. ‘‘ ‘దసరా’ సినిమా చాలా గర్వపడే సినిమా.. స్టన్నింగ్ సినిమా’’ అని పేర్కొన్నారు. దీనికి నాని.. ‘‘మహేష్ సార్ ధన్యవాదాలు. మీరు చెప్పిన ఈ మాట.. పోకిరి సినిమాకు మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ లాంటిది’’ అని రిప్లయ్ ఇచ్చారు. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘దసరా’కు కాంప్లిమెంట్స్ ఇస్తే.. ‘పోకిరి’ సినిమాకు ఎందుకు లింక్ పెడతావ్ అంటూ.. మహేష్ బాబు ఫ్యాన్స్ (Mahesh Babu Fans) కొందరు నానిపై ఫైర్ అవుతున్నారు.

అంటే మ్యూజిక్ మాత్రమేనా.. ‘పోకిరి’ (Pokiri) సినిమా సక్సెస్‌కు మహేష్ బాబుది ఏం లేదా? అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ‘నువ్వు ఇచ్చిన ఎలివేషన్ అదిరిపోయిందన్నా’ అంటూ.. పాజిటివ్‌గా స్పందిస్తూ.. ‘దూకుడు’ సినిమాలో బ్రహ్మానందం, మహేష్ బాబు మధ్య వచ్చే సన్నివేశానికి సంబంధించిన వీడియోలను కొందరు కామెంట్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా అయితే.. ఇండస్ట్రీ నుంచి కూడా ‘దసరా’కు మంచి సపోర్టే లభిస్తున్నట్లుగా మహేష్ బాబు ట్వీట్‌తో తెలిసిపోతుంది. మరి ఈ సూపర్ స్టార్ తర్వాత.. ఇండస్ట్రీ నుంచి ‘దసరా’పై రియాక్ట్ అయ్యే స్టార్ హీరో ఎవరో? అంటూ నాని అభిమానులు (Natural Star Nani Fans) వేచి చూస్తున్నారు. ప్రస్తుతానికైతే.. ‘దసరా’ సినిమా కలెక్షన్స్ (Dasara Collections) పరంగా సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే దిశగానే పయనిస్తోంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Nita Ambani: అట్టహాసంగా మొదలైన నీతా అంబానీ కలల ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం!

*Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

*Allu Arjun: రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి బన్నీ రాలేదని ట్రోల్ చేశారుగా.. ఈ విషయం తెలిస్తే?

*Poonam Kaur: ఫైట్ చేయగలను.. డ్యాన్స్ చేయగలనంటూ ఏ పాటకు డ్యాన్స్ చేసిందంటే..

*Manchu Lakshmi: ‘ఛమ్కీల అంగీలేసి’ పాటకి మంచు లక్ష్మీ స్టెప్స్.. అరిపించేసింది

*Tollywood: శోభితతో చైతూ.. సుప్రియతో శేష్.. ఇలా దొరికేశారేంటి?

Updated Date - 2023-04-01T10:59:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!