Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా రీ రిలీజ్‌కు రెడీ.. విడుదల ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-10-15T22:37:38+05:30 IST

ఈ మధ్య మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ గురించి తెలియంది కాదు. స్టార్ హీరోల చిత్రాలతో పాటు ‘7జి బృందావనకాలనీ’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్‌ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమైంది. నవంబర్ 4న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా రీ రిలీజ్‌కు రెడీ.. విడుదల ఎప్పుడంటే?
Chiranjeevi

ఈ మధ్య మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ గురించి తెలియంది కాదు. స్టార్ హీరోల చిత్రాలతో పాటు ‘7జి బృందావనకాలనీ’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్‌ని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ (Shankar Dada MBBS) సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమైంది. 2004లో వచ్చిన ఈ సినిమా అప్పటి రికార్డులను బ్రేక్ చేసింది. శంకర్ దాదాగా చిరంజీవి (Chiranjeevi) నటించిన తీరు, చెప్పిన ఇంగ్లీష్ సామెతలు, వేసిన స్టెప్పులు అన్నీ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. మెగా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినిమా ప్రేమికులు సైతం ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాకు ముగ్దులయ్యారు. ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్‌ అయిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాను నవంబర్ 4న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. (Shankar Dada MBBS Re Release Date)


Sankar-Dada-MBBS.jpg

మెగా ప్రొడక్షన్స్ (Mega Productions) ద్వారా ఈ చిత్రం నవంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పెద్ద అసెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్లో పాటలు వస్తే.. లైవ్ కాన్సర్ట్‌లా మారిపోతాయని చెప్పాల్సిన పని లేదు. మరోసారి అప్పటి వింటేజ్ చిరుని చూపించేందుకు, ఆ గ్రేస్, మాస్‌ ఎరాలోకి తీసుకెళ్లేందుకు శంకర్ దాదా (Shankar Dada) వస్తున్నాడని సోషల్ మీడియాలో సినీ లవర్స్ ట్వీట్లు, కామెంట్లతో సందడి చేస్తున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. రీ రిలీజ్‌లోనూ ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందనే ఆశాభావాన్ని.. ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్న వారితో పాటు మెగాభిమానులు (Mega Fans) కూడా వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Joju George: ‘ఇరట్ట’ హీరో జోజు జార్జి నటించిన ‘పులిమేద’ ట్రైలర్ విడుదల.. మూవీ విడుదల తేదీ ఫిక్స్

**********************************

*Leo: ‘లియో’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టిక్కెట్‌ ధర రూ.5 వేలా?

***********************************

*Salaar Vs Dunki: రెబల్‌ స్టార్‌తో పోటీకి తగ్గేదే లే అంటోన్న బాద్‌షా..

**********************************

*Salman Khan: ఆయుధం లేకుండానే.. ‘టైగర్’ వారి అంతు చూస్తాడు

***********************************

*Taapsee Pannu: ఇప్పటి వరకు కమర్షియల్ హీరోతో చేసే అవకాశం రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు

*************************************

Updated Date - 2023-10-15T22:37:38+05:30 IST