Leo: ‘లియో’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టిక్కెట్‌ ధర రూ.5 వేలా?

ABN , First Publish Date - 2023-10-14T13:36:02+05:30 IST

యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ - హీరో విజయ్‌ కాంబినేషన్‌లో రానున్న ‘లియో’ చిత్రం ఈనెల 19వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ తమిళ నాడు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రారంభమయ్యాయి. అభిమానుల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు వీలుగా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టిక్కెట్‌ ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారని విజయ్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు.

Leo: ‘లియో’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టిక్కెట్‌ ధర రూ.5 వేలా?
Vijay in Leo Movie

యంగ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) - హీరో విజయ్‌ (Vijay) కాంబినేషన్‌లో రానున్న ‘లియో’ (Leo) చిత్రం ఈనెల 19వ తేదీన విడుదలకానుంది. ఈ సినిమా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ తమిళ నాడు (Tamil Nadu) రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ప్రారంభమయ్యాయి. అయితే, తొలి రోజు, తొలి ఆటను చూసేందుకు అభిమానులు పోటీ పడుతుంటారు. వీరి బలహీనతను సొమ్ము చేసుకునేందుకు వీలుగా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో (First Day First Show) టిక్కెట్‌ ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారని విజయ్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో FDFS అనే ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

చెన్నై, కోయంబత్తూరు, మదురై వంటి నగరాల్లో ఈ ధరలు భారీగా ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో రూ.వెయ్యి వరకు పలుకుతోందని ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఫ్యాన్స్‌ షో పేరుతో పలు సినిమా థియేటర్లు, అభిమాన సంఘాలు ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తూ భారీగా సంపాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి షోలను ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహిస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ‘లియో’ చిత్రాన్ని 19 నుంచి 24వ తేదీ వరకు రోజుకు ఐదు ఆటలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. (Leo FDFS Ticket Price)


Leo.jpg

‘మాస్టర్’ తర్వాత దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రొమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా, జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విజయ్ సరసన త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సంజయ్ దత్, ప్రియా ఆనంద్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, మిస్కిన్, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.


ఇవి కూడా చదవండి:

============================

*Salaar Vs Dunki: రెబల్‌ స్టార్‌తో పోటీకి తగ్గేదే లే అంటోన్న బాద్‌షా..

**********************************

*Salman Khan: ఆయుధం లేకుండానే.. ‘టైగర్’ వారి అంతు చూస్తాడు

***********************************

*Taapsee Pannu: ఇప్పటి వరకు కమర్షియల్ హీరోతో చేసే అవకాశం రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు

*************************************

*KCR: ‘కేసీఆర్’ పేరుతో సినిమా.. హీరో ఎవరంటే..

************************************

*UnstoppableWithNBK3 Promo: ఒకడు నాశనం చేస్తాడు.. మళ్లీ సెట్ చేయడానికి హీరోలు జైలు నుంచి రావాల్సిందే..

********************************

Updated Date - 2023-10-14T13:36:09+05:30 IST