Joju George: ‘ఇరట్ట’ హీరో జోజు జార్జి నటించిన ‘పులిమేద’ ట్రైలర్ విడుదల.. మూవీ విడుదల తేదీ ఫిక్స్

ABN , First Publish Date - 2023-10-15T22:11:20+05:30 IST

ఐన్ స్టీన్ మరియు ల్యాండ్ సినిమాస్ బ్యానర్‌పై ఏ.కె. సజన్ దర్శకత్వంలో జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘పులిమేద’. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌తో పాటు మూవీ విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 26న ఈ మూవీ విడుదల కానుంది.

Joju George: ‘ఇరట్ట’ హీరో జోజు జార్జి నటించిన ‘పులిమేద’ ట్రైలర్ విడుదల.. మూవీ విడుదల తేదీ ఫిక్స్
Joju George and Aiswarya Rajesh

ఐన్ స్టీన్ మరియు ల్యాండ్ సినిమాస్ బ్యానర్‌పై ఏ.కె. సాజన్ (AK Saajan) దర్శకత్వంలో జోజు జార్జి (Joju George), ఐశ్వర్య రాజేష్ (Aiswarya Rajesh) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘పులిమేద’. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా చిత్రయూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌తో పాటు మూవీ విడుదల తేదీని కూడా మేకర్స్ ప్రకటించారు. ఇటీవల ‘ఇరట్ట’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న జోజు జార్జి ఈ ‘పులిమేద’ హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అలాగే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మరో మంచి రోల్ ప్లే చేస్తున్నట్లుగా ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది.


Aishwarya-Rajesh-1.jpg

ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమాపై ఇంట్రెస్ట్‌ని కలగజేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రతి పాత్ర న్యాచురల్‌గా ఉండటం విశేషం. ఐన్ స్టీన్ మీడియా గతంలో జోజు జార్జితో డైరెక్టర్ జోషి దర్శకత్వంలో ‘అంథోని’ సినిమా చేశారు. ‘పులిమేద’ వారి కాంబినేషన్‌లో రెండో సినిమా. ఈ సినిమాకు ఇషాన్ దేవ్ సంగీతం అందించగా.. రఫీక్ అహమ్మద్, డాక్టర్ తార, జయశంకర్ ఫాదద్ మైఖేల్ సినిమాలోని పాటలకు సాహిత్యం అందించారు. బాలచందర్ మీనన్, క్రీమ్బెన్ వినోద్, జానీ అంథోని, జాఫర్ ఇడుక్కి, జియో బేబీ, అబు సలీమ్, సోనా నాయర్, కృష్ణ ప్రభ, పూలే విల్సన్, శిబిల తదితరులు ఈ సినిమాలో నటించారు. అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర దర్శకనిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. (Pulimada Official Trailer Out)


ఇవి కూడా చదవండి:

============================

*Leo: ‘లియో’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టిక్కెట్‌ ధర రూ.5 వేలా?

***********************************

*Salaar Vs Dunki: రెబల్‌ స్టార్‌తో పోటీకి తగ్గేదే లే అంటోన్న బాద్‌షా..

**********************************

*Salman Khan: ఆయుధం లేకుండానే.. ‘టైగర్’ వారి అంతు చూస్తాడు

***********************************

*Taapsee Pannu: ఇప్పటి వరకు కమర్షియల్ హీరోతో చేసే అవకాశం రాలేదంటూ సంచలన వ్యాఖ్యలు

*************************************

Updated Date - 2023-10-15T22:11:20+05:30 IST